భారతదేశంలో ఇప్పటికీ 12 లక్షల కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికే దేశంలోని 18కోట్ల మంది ప్రజలు తమ శరీరంలో కరోనా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని ‘థైరోకేర్ ’ అనే ప్రైవేట్ ల్యాబ్ సంస్థ సర్వే చేసి వెల్లడించింది.
తాజాగా 20రోజుల పాటు దేశంలోని వేర్వేరు పిన్ కోడ్స్ లలో 60వేల మందికి యాంటీబాడీ టెస్టులు థైరోకేర్ సంస్థ నిర్వహించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో 18కోట్ల మంది ప్రజలు ఇప్పటికే తమ శరీరంలో కరోనా రోగ నిరోధక శక్తిని.. కరోనా వ్యతిరేక యాంటీ బాడీస్ కలిగి ఉన్నారని థైరోకేర్ అభిప్రాయపడింది.
ఇక హైదరాబాద్ లోని 500002.. 500060...500036..500026 పిన్ కోడ్ కలిగిన ప్రాంతాల్లోనూ ఈ థైరోకేర్ సర్వే శాంపిల్స్ పరీక్షించగా యాంటీబాడీలు కనిపించాయని రిపోర్టులో తేలింది. వరుసగా పిన్ కోడ్స్ వారీగా 37.3శాతం, 30.6శాతం, 23.5శాతం, 23.3శాతం మందిలో ఈ యాంటీబాడీలు ఉన్నాయని కనుగొంది.
దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 23శాతం మంది కరోనా బారిన పడ్డారని ఓ సర్వే తేల్చింది. దీంతో ఢిల్లీ జనాభాలో 23.48 శాతం మంది ప్రజల్లో యాంటీబాడీలు ఉన్నాయని వెల్లడైంది.