ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. రోజులు గడిచే కొద్దీ కొత్త ప్రశ్నలకు కేరాఫ్ అడ్రస్ లా మారుతోంది. మొన్నటి వరకూ గాల్లో వ్యాపించదన్న థియరీలోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకోవటం కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితమే హాంకాంగ్ లోని పెంపుడు కుక్కకు కరోనా సోకటం.. దీనిపై వైద్యులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. మనుషుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందటం సాధ్యం కాదన్న వాదన.. హాంకాంగ్ ఎపిసోడ్ తో నిజం కాదని తేలిపోయింది.
దీనిపై శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాలో ఒక పులి కరోనా బారిన పడిన వైనాన్ని గుర్తించారు. న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతుప్రదర్శనశాలకు చెందిన నాలుగేళ్ల పులికి కరోనా వైరస్ సోకటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పులికి ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందింది అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
పులి (నాడియా)తోపాటు మరికొన్నిజంతువులు అనారోగ్యాగానికి గురి కావటంతో జూపార్కును మూసి వేసి.. వాటికి పరీక్షలు నిర్వహించారు. దీంతో.. వాటికి కరోనా వైరస్ సోకినట్లు తేల్చారు. పెంపుడు జంతువులు.. పశువుల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో.. నాడియాను ఐసోలేషన్ వార్డుకు తరలించి.. మిగిలిన జంతువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకీ.. నాడియాకు కరోనా ఎలా సోకిందన్న విషయం మీద ఆరా తీస్తే.. జూ సిబ్బందిలో ఒకరి ద్వారా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఇప్పటివరకూ మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని అంచనా వేస్తున్న కరోనాలో కొత్త కోణం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. సో.. జంతువుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న విషయం తాజా ఎపిసోడ్ తో స్పష్టమైనట్లే.