ఆస్ట్రేలియా టెస్టు జట్టు , కెప్టెన్ టిమ్ పైన్ ఇటీవల అభ్యంతరకర మెసేజీల స్కాంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. క్రికెట్ టాస్మానియాకు చెందిన సహచర ఉద్యోగినితో 'సెక్స్‌టింగ్' చేసిన విషయం బయటకు వచ్చింది.
అతను కెప్టెన్ కాక ముందు 2017లో జరిగిన ఈ ఉదంతంపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా కూడా నిజమేనని తేల్చింది. ఆ తర్వాత ఆ పర్సనల్ చాటింగ్ బయటకు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన టిమ్ పైన్ మీడియా ముందుకు వచ్చాడు.
కీలకమైన యాషెస్ సిరిస్, ముందు తాను టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నానని, గతంలో జరిగిన ఘటన పట్ల చాలా పశ్చత్తాపం చెందుతున్నట్లు పేర్కొన్నాడు. దీంతో టిమ్ పైన్ పై ఒక్కసారిగా విమర్శలు తలెత్తాయి.
అసలు అలాంటి నీచమైన పనికి పాల్పడి ఆస్ట్రేలియా కెప్టెన్ పదవిని ఎలా స్వీకరించారని పలువురు వ్యాఖ్యానించారు. కెప్టెన్ గానే కాదు.. అతడిని ఆటగాడిగా కూడా జట్టులో కొనసాగించవద్దని డిమాండ్లు వచ్చాయి.
త్వరలో యాషెస్ ప్రారంభం కానున్నది. అయితే తుది జట్టులో టిమ్ పైన్ ఉంటాడా లేదా అనేది ఇంకా సందిగ్దంగానే ఉన్నది.టిమ్ పైన్ త్వరలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ టాస్మానియా శుక్రవారం ప్రకటించింది. టిమ్ పైన్ సెక్స్‌టింగ్ వ్యవహారం ఆస్ట్రేలియాలో తీవ్ర దుమారం రేపడంతో అతడు రాజీనామా చేశాడు.
అదే సమయంలో అతడు యాషెస్ ఆడే విషయంలో కూడా సానుకూలత వ్యక్తం కావడం లేదు. డిసెంబర్ 8 నుంచి యాషెస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్చ మరింత తీవ్ర రూపం దాల్చింది.
గత 24 గంటలుగా చర్చించిన అనంతరం టిమ్ పైన్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికేందుకు సిద్దపడ్డాడని క్రికెట్ టాస్మానియా ఆ ప్రకటనలో పేర్కొన్నది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పడమే కాకుండా.. అసలు క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలకు కూడా దూరంగా ఉండేందకు టిమ్ పైన్ సిద్దపడ్డట్లు తెలుస్తున్నది.
ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అన్ని ఫార్మట్లకు కొద్ది రోజులు దూరంగా ఉంటాడని క్రికెట్ టాస్మానియా శుక్రవారం తెలిపింది
కానీ కెప్టెన్ గా వైదొలిగేటప్పుడు, ఆ సమయంలో తాను ఆస్ట్రేలియా టెస్టు జట్టులో నిబద్ధతతో కూడిన సభ్యుడుగా ఉండాలను కుంటున్నానని పైన్ చెప్పాడు. యాషెస్ పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ బుధవారమే పైన్ కు ఆస్ట్రేలియా జట్టు పూర్తి మద్దతు ఉందని చెప్పాడు.
తొలి టెస్టుకు తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అర్హుడని పేర్కొన్నాడు. పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్ కొత్త కెప్టెన్సీ రేసులో ఉన్నారు. కొత్త టెస్ట్ కెప్టెన్ ను ఐదుగురు వ్యక్తుల ప్యానెల్ నిర్ణయించనుంది. టిమ్ పైన్పై వచ్చిన ఆరోపణల ప్రభావం యాషెస్ సిరీస్ పై తీవ్రంగా ఉంటుందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. త్వరలోనే కొత్త కెప్టెన్‌కు సంబంధించిన వార్తను ప్రకటించే అవకాశం ఉన్నది.