వైసీపీ అధిష్టానం సకాలంలో జోక్యం చేసుకుని గొడవలు సర్దుబాటు చేసుంటే రామకృష్ణారెడ్డి ప్రాణాలు నిలిచుండేవా ? ఇపుడిదే పార్టీలో జరుగుతున్న చర్చ. హిందుపురంలో వైసీపీలో బాగా యాక్టివ్ గా ఉండే నియోజకవర్గం సమన్వయకర్త రామకృష్ణారెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే.
పార్టీలోని అతని ప్రత్యర్ధుల కారణంగానే తన తమ్ముడు చనిపోయాడని మృతుడి సోదరి మధుమతి ఆరోపిస్తున్నారు. ఎంఎల్సీ మొహమ్మద్ ఇక్బాల్, అతని పీఏ గోపీ కృష్ణే తన తమ్ముడు చనిపోవడానికి కారకులంటూ ఆమె ఆరోపించటం సంచలనంగా మారింది.
నిజానికి రామకృష్ణారెడ్డికి దివంగత సీఎం వైఎస్సార్ అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా పిచ్చి అభిమానమట. ఆ అభిమానం వల్లే అన్నీ వదులుకుని పార్టీకోసం పనిచేస్తున్నట్లు మధుమతి చెప్పారు. పార్టీకోసం అంత కమిటెడ్ గా పనిచేసిన తన తమ్ముడిని ఒక ఎంఎల్సీ వేధింపులకు గురిచేయటం ఏమిటంటే ఆమె నిలదీస్తున్నారు. రామకృష్ణారెడ్డి చనిపోయిన తర్వాత పార్టీ అగ్రనేతల్లో ఒక్కరంటే ఒక్కళ్ళు కూడా పరామర్శకు రాలేదని పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి.
హిందూపురం లో జరుగుతున్న గొడవలు చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవహారంపై విచారణ జరపేబధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇదే విషయమై నేతలు మండిపోతున్నారు. ఇక్బాల్ కు రామకృష్ణారెడ్డికి మధ్య గొడవలున్నాయన్న విషయం పార్టీలో అందరికీ తెలుసట. ఈ గొడవల విషయంలో అధిష్టానం జోక్యం చేసుకుని సర్దుబాటు చేసుంటే ఇపుడీ పరిస్ధితి తలెత్తేది కాదంటున్నారు.
రామకృష్ణారెడ్డి పార్టీకోసం కమిటెడ్ గా పనిచేసే నేతగా అందరు చెబుతున్నారు. మరంతటి సిన్సియర్ నేతను కోల్పోతే పార్టీకి ఎంతనష్టమో అధిష్టానమే గ్రహించాలి. లోకల్ నేతలు చెబుతున్నట్లుగా ముందే జోక్యం చేసుకుని వీళ్ళమధ్య పంచాయితీని సర్దుబాటు చేసుంటే బాగుండేదేమో.
కానీ ఇపుడు పరిస్ధితి ఎలాగైపోయిందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లయ్యింది. ఇప్పటికైనా ఇలాంటి ఘటన మరే జిల్లాలో జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.