కాలం మారిందన్న మాటకు సరిగ్గా సూట్ అయ్యే ఉదంతంగా దీన్ని చెప్పాలి. భర్త కోసం.. మోసం చేసిన ప్రియుడి కోసం.. మహిళలు మౌనపోరాటాలు చేయటం ఇప్పటివరకూ చూసే ఉంటాం. తాజాగా సీన్ మారింది. పుట్టింటికి వెళ్లిన భార్య తనతో శాశ్వితంగా తెగతెంపులు చేసుకుంటానని చెబుతూ విడాకులు నోటీసులు పంపిన వైనంతో అవాక్కు అయిన భర్త.. తాజాగా తన అత్తారింటి ముందుమౌనపోరాటానికి దిగిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
రోటీన్ కు భిన్నంగా సాగిన ఈ ఉదంతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న తాము.. ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపురం సాగిందని.. .ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని సదరు భర్త వాపోతున్నాడు. అసలేం జరిగిందన్న విషయంలో వెళితే.. ఆరేళ్ల క్రితం అంటే.. 2014లో లేఖ శర్మ అనే యువతిని కరీంనగర్ జిల్లాకు చెందిన రాంకరన్ అనే యువకుడు ప్రేమించాడు. ఇరువురు పరస్పర అంగీకారంతో.. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
ఐదేళ్లుగా వారి కాపురంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. సాఫీగా సాగుతున్న వేళ.. కొన్ని అనివార్య కారణాలతో భార్యను పుట్టింటికి పంపాడు. అంతే.. సీన్ మొత్తం మారిపోయిందట. పుట్టింటికి వెళ్లిన కొద్ది రోజులకే తనకు రాంకరన్ తో కాపురం చేయటం ఇష్టం లేదంటూ భార్య నుంచి విడాకుల నోటీసులు రావటంతో షాక్ తిన్నాడు. అప్పటి నుంచి తన భార్యను కాపురానికి రావాలంటూ ప్రాధేయపడుతున్నాడు. అయినా పరిస్థితుల్లో మార్పులు లేకపోవటంతో అనూహ్యంగా రియాక్ట్ అయ్యారు.
ప్రస్తుతం కరోనాకారణంగా కోర్టులు మూసివేయటం.. విడాకుల నోటీసు నేపథ్యంలో తన భార్య తన వద్దకు రావాలన్న ఉద్దేశంతో మౌనపోరాటానికి దిగాడు. తన తీరుతో తన భార్య మనసును మార్చి తనతో తీసుకెళతానని మౌనపోరాటం చేస్తున్న రాంకరన్ చెబుతున్నాడు. మరి.. అతని భార్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.