తమిళనాడు రాజకీయాల్లో రకరకాల ఫార్ములాలు పనిచేస్తూ ఉంటాయి. డీఎంకే - అన్నా డీఎంకే లు తప్ప మిగిలిన ఏపార్టీలైనా - ఎప్పుడైనా కలిసి పనిచేసే అవకాశాలు లేకపోలేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో వాటికి బలం చేకూర్తుస్తూ తాజాగా కాంగ్రెస్ - విజయకాంత్ కలుసుకున్నారు! అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో చతికిలబడ్డ విజయకాంత్ స్థానిక ఎన్నికలతో బలాన్ని చాటుకునేందుకు తీవ్ర కుస్తీలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు కూడా స్థానిక ఎన్నికల్లో అయినా సత్తా చాటాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానో ఏమో తాజాగా తమిళనాడు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆ పార్టీ అధినేత విజయకాంత్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయచర్చ సాగినట్టు కథనాలు వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎండీకే తో కలిసి పోటీచేయాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి, అయితే అప్పట్లో ఏమాత్రం వెనక్కి తగ్గే మూడ్ లో లేని విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరి డిపాజిట్లనే కోల్పోవాల్సిన పరిస్థితిని చవిచూశారు! అయితే ప్రస్తుతం తమిళనాడులో ఉపన్నికలు అనే కథనాలు వస్తోండటం - మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు - దీంతో మరో ప్రయత్నం చేస్తోన్నట్లుంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయానికి రావడం, కెప్టెన్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
అయితే ఈసారి అయినా విజయ్ కాంత్ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం వీరిరువురూ కలిసే పోటీ చేస్తారు అనే కథనాలు మాత్రం తాజాగా వెలువడుతున్నాయి. అలా కాని పక్షంలో కాంగ్రెస్ డీఎంకే తో కలిసి స్థానికంగా పోటీ చేయాలని భావిస్తున్నా... వారం పదిరోజుల క్రితమే స్టాలిన్ కు వ్యతిరేకంగా తిరునావుక్కరసర్ స్పందించిన సంగతి డీఎంకే వర్గాలు మరిచిపోయి ఉంటాయని అనుకోలేం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు డీఎంకే తో దారులు మూసుకుపోయినట్లే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో తమిళనాడులో కాంగ్రెస్ కు కచ్చితంగా డీఎండీకే అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/