బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వేడి పెరుగుతోంది. ఇందులో భాగంగానే వైసీపీ, టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించేసి ప్రచారానికి శ్రీకారం చుట్టేశాయి. బీజేపీ కూడా ఇదే పనిలో ఉంది. ఇందులో భాగంగానే తిరుపతికి వెళ్ళిన వీర్రాజు మీడియాతో మాట్లాడుతు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి వైసీపీ సాధించిన గెలుపు కూడా ఓ గెలుపేనా అంటు ఎద్దేవాచేశారు.
అలాగే వాలంటీర్ల వ్యవస్ధను అడ్డుపెట్టుకుని ప్రత్యర్ధులను భయపెట్టి వైసీపీ గెలిచిందన్నారు. పథకాలు, ఇళ్ళపట్టాలను నిలిపేస్తామని లబ్దిదారులను భయపెట్టి ఓట్లేయించుకుందన్నారు. ఇలాంటి అనేక ఆరోపణలు చేసిన వీర్రాజు అన్నీ విషయాలపై కేంద్రానికి తమ పార్టీ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని పట్టించుకున్న జనాలే లేరు. ఈ పరిస్దితుల్లో తిరుపతి ఉపఎన్నిక జరగబోతోంది.
ఈ ఎన్నికలో కూడా బీజేపీకి డిపాజిట్ దక్కేది కూడా అనుమానమే. క్షేత్రస్ధాయిలో వాస్తవం ఇలాగుంటే ఉపఎన్నికలో గెలవబోయేది తామే అంటు వీర్రాజు ఒకటికి పదిసార్లు ఊదరగొడుతున్నారు. పార్టీ పరిస్ధితి ఏమిటో జనాలతో పాటు వీర్రాజుకు కూడా బాగా తెలుసు. అయితే ఉపఎన్నికలో పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాకపోతే ఢిల్లీలోని అగ్రనేతలకు సమాధానం చెప్పుకోవాల్సుంటుంది. అందుకనే ముందునుండే అందరినీ మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్లుంది.
ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచారని, ధౌర్జన్యాలు చేశారని, దొంగఓట్లు వేయించుకున్నారని...ఇలా అనేక కారణాలను ముందునుండే చెబుతుంటే రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత ఓ సాకును చూపించుకుని నివేదికను తయారు చేయటానికి రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణి, ధౌర్జన్యాలు ఇప్పుడే కొత్తగా మొదలైనట్లు వీర్రాజు చెప్పటమే విచిత్రంగా ఉంది. మొత్తంమీద భవిష్యత్ ఫలితాలపై వీర్రాజుకు మంచి విజనే ఉన్నట్లుంది.