మొన్ననే జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో అధికార వైసీపీ టార్గెట్ రీచవటం ఖాయమేనా ? ఇఫుడిదే చర్చ చాలా జోరుగా మొదలైంది. ఎగ్జిట్ పోల్ ఫలితం గురువారం సాయంత్రం విడుదలైంది. ఆరా సంస్ధ జరిపిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి 65.85 శాతం ఓట్లు వస్తాయట. టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 23.10 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. ఇక బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు 7.34 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ గెలుస్తుందన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయంలేదు. అయితే రికార్డు 5 లక్షల మెజారిటిని సాధించాలని వైసీపీ నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాగే టీడీపీకి గెలుపుపై నమ్మకం లేకపోయినా 2019 ఎన్నికల్లో వచ్చిన 4.94 లక్షల ఓట్లు తెచ్చుకుంటే చాలని అనుకున్నది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధులు ఏదో ఉనికి కోసమే పోటీచేశారు. అయితే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత వైసీపీ-టీడీపీల నేతల మధ్య ఆవేశకావేశాలు పెరిగిపోయాయి.
ఎలాగైనా వైసీపీని టార్గెట్ రీచ్ కానీయకూడదన టీడీపీ గట్టిగానే ప్రయత్నించింది. దీనికి తగ్గట్లే ప్రచార వ్యూహాలను రచించి బాగానే కష్టపడింది. అయితే ప్రచారంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఓటింగ్ 64 శాతం దగ్గరే ఆగిపోయింది. 2019 లో నమోదైన 80 శాతం పోలింగ్ తో పోల్చుకుంటే ఉపఎన్నికలో 16 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. తగ్గిన ఓటింగ్ ప్రభావం టీడీపీ డైరెక్టుగా పడింది.
దీంతో ఎవరి అంచనాలు నిజమవుతాయో, ఎవరివి ఫెయిల్ అవుతాయో అర్ధంకాలేదు. ఇలాంటి నేపధ్యంలోనే వెలువడిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 65. 85 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అంటే తమ టార్గెట్ కు దగ్గరగా వైసీపీకి ఓట్లు వస్తాయనే నమ్మకం అధికారపార్టీ నేతల్లో పెరిగిపోయింది. ఇదే సమయంలో టీడీపీ అంచనాకు తగ్గట్లు ఓట్లు రావటం లేదనే అనుకోవాలి. ఇక బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల గురించి చెప్పుకోవాల్సింది కూడా ఏమీలేదు.