ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉదంతం.. విషాదాంతం అయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ శకలాల ను తిలకించడానికి టైటాన్ మినీ జలాంతర్గామి లో వెళ్లిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లేనని తెలిసింది. అయితే... ఈ మినీజలాంతర్గామి ఎప్పుడు విచ్చిన్నమైంది.. ఎలా విచ్చిన్నమైంది.. బయలుదేరిన ఎంత సమయానికి విచ్చిన్నమైంది అనే అంశాలపై కీలక విషయాలు తెర పైకి వస్తున్నాయి.
టైటాన్ కోసం ఇంత భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ.. ఆ మినీ జలాంతర్గామి మాత్రం అదృశ్యమైన కొన్ని గంటలకే విచ్ఛిన్నమై ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికా నేవీ వ్యవస్థల కు వినిపించిన పేలుడు శబ్దాలే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని అంటున్నారు.
అవును... టైటానిక్ శకలాల సందర్శనకు వెళ్లిన మినీ జలాంతర్గామి టైటాన్ కుప్పకూలిపోయినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ ముగేర్ పేర్కొన్నారు. సముద్రంలో 13,000 అడుగుల లోతున ఉన్న టైటానిక్ శకలాల కు.. సుమారు 1,600 అడుగుల దూరంలో ఈ మినీ జలాంతర్గామి ఆనవాళ్లను గుర్తించామని తెలిపారు.
ఈ ప్రమాధంలో టైటాన్ జలాంతర్గామి ప్రెజర్ ఛాంబర్ పూర్తిగా దెబ్బతిందని కోస్ట్ గార్డ్ పేర్కొంది. ఇది సముద్రం ఒత్తిడి ని ఏమాత్రం తట్టుకోలేక కుప్పకూలిందని తెలిపింది. ఫలితంగా... ఈ మినీ జలాంతర్గామిలో ఉన్నవారికి ఏం జరుగుతోందో తెలిసేలో పే అది కుప్పకూలిపోయి ఉంటుందని చెబుతున్న నిపుణులు... గంట కు 1,500 మైళ్ల వేగంతో ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు.
అయితే ఈ మినీ జలాంతర్గామి కుప్పకూలడానికి కారణమైన పరిస్థితులను నిపుణులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన ప్రదేశం "మిడ్ నైట్ జోన్" లో నీటి పీడనం.. భూమి పై ఉన్న దాని కంటే 350 రెట్లు అధికంగా ఉందని... ప్రమాదానికి ఇదే ప్రధాన కారణం అని స్పష్టం చేస్తున్నారు.
ఏమిటీ మిడ్ నైట్ జోన్:
సముద్ర గర్భంలో 3,300 అడుగుల నుంచి 13,100 అడుగుల లోతు వరకు ఉండే ప్రదేశాలను మిడ్ నైట్ జోన్ అంటారు. ఇందు లో భాగంగా టైటానిక్ ఓడ శకలాలు కూడా 13,000 అడుగుల లోతులో ఉండటంతో... టైటానిక్ ఓడ శకలాలున్న ప్రదేశాన్ని కూడా మిడ్ నైట్ జోన్ గా వ్యవహరిస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత కేవలం 4 సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుండగా... ఈ ప్రదేశాల్లో చదరపు అంగుళానికి 2,700 కిలోల పీడనం ఉంటుంది.