ఇండస్ట్రీ మొత్తాన్ని కలచివేస్తున్న టిఎన్ఆర్ మృతి.. నెట్టింట టిఎన్ఆర్ చివరి వీడియో వైరల్!

Update: 2021-05-10 13:31 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కారణంగా ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతకాలం కళ్ళముందు మెదిలిన మనుషులు కనబడకుండా పోతున్నారని కుటుంబసభ్యులు ఫ్యాన్స్ ఎంతో బాధను తెలియజేస్తున్నారు. అయితే తాజాగా ఓ జర్నలిస్ట్ మరణం వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకు ఎన్నో వందల ఇంటర్వ్యూలు చేసినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ టిఎన్ఆర్ (తుమ్మలనరసింహరెడ్డి) కరోనా సోకి సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరిని కలచివేస్తోంది. ఎందుకంటే టిఎన్ఆర్ అంటే అటు ఇండస్ట్రీకి ఇటు రాజకీయనేతలకు అందరికి సుపరిచితులే.

టిఎన్ఆర్ మరణం గురించి తెలిసి చాలామంది ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేసారు. టిఎన్ఆర్ మరణం పై హీరో విజయ్ దేవరకొండ స్పందించి.. టిఎన్ఆర్ సార్ మీ మరణం మా ఫ్యామిలీ మొత్తాన్ని షాక్కు గురిచేసింది. మిమ్మల్ని మిస్ అవుతున్నాం' అంటూ ట్వీట్ చేసాడు. అదేవిధంగా హీరోయిన్ అనన్య నాగల్ల.. 'నా కెరీర్ ప్రారంభమైంది మీ వల్ల సార్. మీ మరణవార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఎప్పటికి మిస్ అవుతున్నాను' అని ట్వీట్ చేసింది. నటుడు సునీల్ ట్విట్టర్ వేదికగా.. 'టిఎన్ఆర్ సార్ ఇకలేరనే వార్త విని షాకయ్యాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. కానీ చాలా త్వరగా వెళ్లిపోయారు సార్' అంటూ ట్వీట్ చేసాడు. ఇలా మంచు మనోజ్, విష్ణు, డైరెక్టర్ శ్రీనువైట్లలతో పాటు ప్రముఖులు ట్వీట్స్ ద్వారా ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా టిఎన్ఆర్ మరణించక ముందు కరోనా వైరస్ పై ఆయన అవగాహనా కల్పిస్తూ తీసిన ఓ వీడియో.. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కరోనా పై అంతలా అవగాహనా కల్పించిన టిఎన్ఆర్ గారు అదే కరోనాకు బలికావడం కలచివేస్తోంది. తెలంగాణ గవర్నమెంట్ సూచించిన 'స్టేహోమ్ ఛాలెంజ్' స్వీకరించిన టిఎన్ఆర్ తాను వారంపాటు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో తెలిపారు. అలాగే కరోనా రాకూడదు అంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యమని చెప్పి రోజు ప్రాణాయామం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే కరోనా పట్ల జాగ్రత్తలు కూడా చెప్పారు టిఎన్ఆర్. చివరికి ఆయనే ఇలా కరోనాతో చనిపోవడం వీడియో చూసిన వారందరిని బాధకు గురిచేస్తోంది. ప్రస్తుతం టిఎన్ఆర్ గారు జర్నలిజంతో పాటు సినిమాలలో కూడా నటిస్తున్నారు.


Full View
Tags:    

Similar News