వైరల్ న్యూస్...బీజేపీ కూడా క్విట్ ప్రో కో చేస్తదా..?

Update: 2021-03-27 03:38 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా / కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి ల‌బ్ధి చేకూరుస్తోన్న పెద్ద అధికారుల‌కు పెద్ద పెద్ద ప‌ద‌వులు బ‌హుమ‌తులుగా వ‌స్తున్నాయ‌న్న ప్ర‌చారం కొన్నేళ్ల నుంచి ఉన్న‌దే. ఈ క్ర‌మంలోనే బీజేపీ / మోడీ / అమిత్ షాకు మేళ్లు చేకూర్చిన వారికి ఎలాంటి ప‌ద‌వులు వ‌చ్చాయో ? వివ‌రిస్తూ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియో ఉన్న అంశాలు చూస్తే రంజ‌న్ గొ‌గోయ్ సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ గా రిటైరైన నాలుగు నెల‌ల‌కే రాజ్య‌స‌భ స‌భ్యుడు అయ్యారు. మోడీ - బీజేపీ ప్ర‌భుత్వానికి అనుకూలంగా రాఫెల్‌ - క‌శ్మీర్ మొద‌లైన ఏడు కేసుల్లో అనుకూల‌మైన తీర్పు ఇచ్చినందుకే ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇచ్చార‌న్న ప్ర‌చారం ముందు నుంచే ఉంది. ఇక జ‌స్టిస్ స‌దాశివం అమిత్ షాకు ఫేక్ ఎన్‌ కౌంట‌ర్ కేసు నుంచి క్లీన్ చిట్ ఇచ్చినందునే ఆయ‌న‌కు కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇచ్చార‌ని అప్ప‌ట్లోనే విప‌క్షాలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశాయి.

వైసీ. మోడీ న‌రేంద్ర‌మోడీకి 2002 గోద్రా మ‌ర‌ణ‌హోమం కేసులో క్లీన్ చిట్ ఇచ్చినందునే ఆయ‌న‌కు నేష‌న‌ల్ ఇన్వెస్ట్‌గేష‌న్ ( ఎన్ఐఏ) చీఫ్ ప‌ద‌వి వ‌చ్చింద‌ని... మాజీ పోలీసు చీఫ్ ఆర్కే. రాఘ‌వ‌న్ 2002 గోద్రా మ‌ర‌ణ‌హోమంలో న‌రేంద్ర మోడీకి క్లీన్ చీట్ ఇచ్చినందునే ఆయ‌న‌కు సైప్ర‌స్ హైక‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఇచ్చార‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా గ‌ట్టిగా వినిపించింది. యుయు. ల‌లిత్ అమిత్ షా ఫేక్ ఎన్‌కౌంట‌ర్ కేసులో లాయ‌ర్‌. ఈ కేసులో షాను సేవ్ చేసినందుకు గాను ఆయ‌న్ను సుప్రీంకోర్టు జ‌డ్జిగా నియ‌మించార‌న్న టాక్ కూడా ఉంది.

కాగ్ మాజీ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ అయిన వినోద్ రాయ్ సీఏజీ 2జీ ఎలిగేష‌న్ బ‌య‌ట పెట్టారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో కాని ఆయ‌న‌కు బీసీసీఐ చైర్మ‌న్ ప‌ద‌వితో పాటు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు వ‌చ్చాయి. జేఎన్‌యు విద్యార్థుల‌పై పోలీసుల దాడులు చేయించిన ఢిల్లీ అధికారి బీఎస్‌. బ‌సీ త‌ర్వాత యూపీఎస్సీ మెంబ‌ర్ అయ్యారు. ఈ ప‌రిణామాలు చూస్తోన్న జాతీయ రాజ‌కీయ మేథావులు సైతం బీజేపీకి - ఆ పార్టీ నేత‌ల‌కు మేళ్లు చేసిన ఉన్న‌తాధికారులు ఆ ప‌ద‌వి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే కీల‌క ప‌ద‌వులు ద‌క్కించుకుంటున్నార‌నే సందేహిస్తున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వ అవాస్త‌వాల లోగుట్టు ఏమిటో ?





Tags:    

Similar News