తెలుగు యువత కు.. తదుపరి నేత ఎవరు ?

Update: 2019-11-14 09:14 GMT
మిగతా పార్టీల్లో కన్నా తెలుగు దేశం పార్టీ లో అంతర్గత పదవులకు చాలా విలువ ఎక్కువంటారు! పార్టీ పదవుల కు  కూడా చంద్రబాబు నాయుడు అలా డిమాండ్ పెంచారు. ప్రత్యేకించి పార్టీ అధికారం లో లేని సమయం లో పార్టీ పదవుల్లో ఉన్న వారికి టీడీపీ లో చాలా విలువే ఉంటుంది!

ఈ క్రమం లో అలా తెలుగుదేశం పార్టీ లో చెప్పుకో దగిన హోదా 'తెలుగు యువత' పదవి. ఇలాంటి పదవులు అన్ని పార్టీల్లోనూ ఉండేవే. అయితే కొన్ని పార్టీల్లో యూత్ వింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో పని చేసిన వారు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడం, ఆల్రెడీ కొంత వయసు మీద పడిన వాళ్లను ఆ పదవి లో పెట్టడం జరుగుతూ  ఉంటుంది. వారు ఆల్రెడీ ఎమ్మెల్యే లు కూడా అయిన సందర్భాలుంటాయి.

అయితే ఇంకా రాజకీయం గా ఎదుగుతున్న దశలోని వారు అలాంటి పదవి లో ఉంటే అదో ముచ్చట. దేవినేని అవినాష్ కూడా అదే కేటగిరి కి సంబంధించిన వ్యక్తే! ఇన్నాళ్లూ తెలుగు యువత అధ్యక్షుడి గా ఆయనకు ఒక హోదా ఉండేది, ఆ హోదా కూ ఒక నేత ఉండేవారు. అయితే తెలుగు దేశం  పార్టీ లో దేవినేని నెహ్రూ తనయుడు ఎక్కువ కాలం మనుగడ సాగించ లేకపోయారు. పార్టీలో చేరగానే యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ, ఇప్పుడు బయటకు వెళ్లిపోతూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యం లో 'తెలుగు యువత'కు తదుపరి ప్రెసిడెంట్ ఎవరనేది ఆసక్తిదాయకంగా మారింది. ఈ  జాబితాలో కొన్ని పేర్లు వినిపిస్తూ  ఉన్నాయి. పరిటాల శ్రీరామ్, రామ్మోహన్ నాయుడు, జేసీ పవన్ వంటి ప్రముఖుల పేర్లు ఆ జాబితా లో ఉన్నాయి. వీళ్లంతా రాజకీయాన్ని వారసత్వం గా తీసుకున్న వాళ్లే.

వీళ్లలో రామ్మోహన్ నాయుడు  ఆల్రెడీ ఎంపీ గా ఉన్నారు. ఆయనకు వేరే బాధ్యతలు అప్పగిస్తారనే అంచనాలూ ఉన్నాయి. ఇక జేసీ  పవన్ రాజకీయం గా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. పవన్ కన్నా వాళ్ల నాన్నే కొంత యాక్టివ్ గా కనిపిస్తారు!

ఇక పరిటాల శ్రీరామ్ ఆ పదవిని తీసుకోవచ్చేమో కానీ, ఆయనకు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అంతంత మాత్రమే. కాబట్టి..ఆ పదవి లో ఏ మేరకు మీడియా తో అనుసంధానం కాగలరనేది అనుమానమే. ఇక లేడీకి కూడా ఆ పదవిని ఇవ్వొచ్చని, శింగనమల నుంచి పోటీ  చేసి తొలి సారి రాజకీయాల్లోకి  ఎంట్రీ ఇచ్చిన బండారు శ్రావణి పేరు కూడా ఈ జాబితా లో వినిపిస్తోంది.

అయితే ప్రస్తుతం తెలుగు దేశం శ్రేణులు  పోరాట స్ఫూర్తితో లేరు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు నేర్పిన రాజకీయాలు అలా ఉన్నాయి. అధికారమే పరమావధి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. ఎడాపెడా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇలాంటి క్రమం లో ఆయన అనుసరించిన సిద్దాంత మే ఇప్పుడు ఆయన పార్టీలోని  వారూ ఫాలో అవుతున్నారు. కాబట్టి తెలుగు యువత కావొచ్చు, తెలుగుదేశం పార్టీ లోని పదవి కావొచ్చు.. ఆ పదవుల ను తీసుకుని గట్టిగా పోరాడే వాళ్లు ఉన్నారా? అనేది మాత్రం సందేహం గానే ఉంది!
Tags:    

Similar News