ఉద్యోగులు మ‌ద్ద‌తు టీడీపీకి ఉందా? లేదా ?

Update: 2022-01-27 03:52 GMT
ఏపీలో  ఉద్యోగుల మ‌ద్ద‌తు ఎవ‌రికి ?  రాజ‌కీయంగా వీరిని మ‌న‌వైపు తిప్పుకున్నామా ?  లేదా ? ఇదీ.. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ లో ఆస‌క్తిగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. గ‌తంలో ఉద్యోగుల‌కు తాము అన్ని విధాలా అండ‌గా ఉన్నామ‌ని.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. వారు కోర‌కుండానే తాము అనేక రూపాల్లో.. సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని.. హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి వ‌చ్చిన సంద‌ర్భంగా.. ఐదు రోజుల ప‌నిదినాలు, ఏసీ బ‌స్సుల సౌక‌ర్యం.. పాస్‌లు.. ఇలా అనేక సౌక‌ర్యాలు క‌ల్పించారు.దీంతో అప్ప‌ట్లోనే ఉద్యోగులు.. త‌మ వెంటే ఉన్నార‌ని.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ఉద్యోగ సంఘాల నాయ‌కుడుగాఉన్న ప‌రుచూరు అశోక్‌బాబును ఎమ్మెల్సీ చేశారు. అదేస‌మ యంలో  అమ‌రావ‌తి జేఏసీ ఏర్పాటుకు బొప్ప‌రాజు వంటివవారికి అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇన్ని చేసి నా.. గత ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయింది. ఇక‌, ఇప్పుడు.. వైసీపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు ఏమీ ఇవ్వ‌డం లేద ని.. క‌నీసం పీఆర్సీ ప్ర‌క‌టించినా.. వేత‌నాలు త‌గ్గిపోతున్నాయ‌ని.. వారు ఉద్య‌మిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌త ప్ర‌భుత్వ‌మే త‌మ‌కు న్యాయం చేసింద‌ని కొన్నాళ్లుగా చెప్పుకొచ్చారు.  

దీంతో ఈ క్రెడిట్ త‌మ‌కు ద‌క్కుతుంద‌ని.. ద‌క్కిన‌ట్టేన‌ని.. టీడీపీ నాయ‌కులు భావించారు. కానీ, అనూహ్యంగా ఏం జ‌రిగిందో ఏమో.. మ‌ధ్య‌లో ఉద్యోగులు త‌మ‌కురాజ‌కీయ ప్రాతిప‌దిక లేద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో  ఎక్క‌డా ఎవ‌రూకూడా గ‌త ప్ర‌భుత్వం త‌మ‌కు ఇది చేసింది.. అది చేసింద‌నే వాద‌న‌ను ఉద్యోగ సంఘాల నాయ‌కులు పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. దీంతో టీడీపీ అప్ప‌టి వ‌ర‌కు పెట్టుకున్న ఆశ‌లు ఒక్క‌సారిగా ప‌క్క‌కు జ‌రిగిపోయాయి. లేక‌పోతే.. తాము కూడా ఉద్య‌మించాల‌ని అనుకున్నారు.

కానీ, టీడీపీ జోలికి వెళ్లినా.. లేక టీడీపీ త‌మ జోలికి వ‌చ్చినా.. ప్ర‌భుత్వ ఆగ్ర‌హానికి గురి కాక‌త‌ప్ప‌ద‌ని.. భావించిన ఉద్యోగ సంఘాలు.. ఆ పార్టీని వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టాయి. దీంతో ఇప్పుడు అస‌లు.. రాజ‌కీయంగా త‌మ‌కు ఉద్యోగులు దూర‌మ‌య్యారా ?  ద‌గ్గ‌ర‌య్యారా ? అనే చ‌ర్క‌చ టీడీపీలో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో ఎటూ తేల్చుకోలేక‌.. నాయ‌కులు స‌త‌మ‌త‌మ‌వుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News