హాలీవుడ్ డైరెక్టర్ కోసం అలీ రాయబారం

Update: 2020-01-24 10:56 GMT
టాలీవుడ్ కమెడియన్ గా సుపరిచితమైన ఆలీలోని కొత్త యాంగిల్ మాత్రమే కాదు.. సరికొత్త టాలెంట్ తాజాగా బయటకు వచ్చింది. రీల్ లో కమెడియన్ గా కామెడీ చేసినా.. రియల్ లైఫ్ లో మాత్రం సీరియస్ పాలిటిక్స్ చేయటంలో ఆయనకు ఆయనే సాటి. సినిమా బంధంలో పవన్ కు అలీకి మధ్యనున్నరిలేషన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పవన్ ను సైతం లైట్ తీసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తీరు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఆయన ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు వెళ్లటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలాంటి చర్చా లేకుండా నేరుగా ఢిల్లీలోని పార్టీ ఆఫీసుకు అలీ ఎందుకు వెళ్లినట్లు? అన్న క్వశ్చన్ చాలామందికి వచ్చింది కానీ.. సమాధానం మాత్రం రాలేదు. దీంతో. . ఆయన్నే నేరుగా అడిగేయగా.. ఊహించని విషయాల్ని వెల్లడించారు. తాను బీజేపీ ఆఫీసుకు రాజకీయాల కోసం రాలేదని.. తనకో హాలీవుడ్ దర్శకుడు తెలుసని.. అతను త్వరలోనే ఇండియాకు రాబోతున్నట్లుగా చెప్పారు.

ఆయన భారత్ వచ్చిన తర్వాత దేశ ప్రధానిని కలవాలన్న ఆకాంక్షను అలీకి చెప్పారట. దీంతో.. వాళ్లను వీళ్లను అడిగి లాబీయింగ్ చేయటం ఎందుకని.. తానే స్వయంగా పార్టీ ఆఫీసుకు వచ్చినట్లు చెప్పారు. మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసి కోరారు అలీ. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఏమైనా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతమంది అగ్ర దర్శక నిర్మాతలు.. బడా నటులు ఉంటే.. ఏరికోరి అలీనే ప్రధానితో భేటీ కోసం టైం అడగటం చూస్తే.. అలీ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News