తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్లు.. సినిమా వాళ్లు కాస్త సీనియారిటీ వచ్చి ముదిరితే.. వాళ్లు ఏదో ఒక పార్టీలో చేరి ఆటోమేటిగ్గా రాజకీయ నాయకులు అయిపోతారు. అప్పటివరకు ప్రెస్ మీట్ లో సరిగ్గా మాట్లాడ్డం రానివాళ్లు కూడా ప్రత్యర్థి పార్టీపై అనర్గళంగా విమర్శలు చేస్తుంటారు.
ఏపీలో ఇప్పుడు ఎన్నికల టైమ్. దీంతో.. సినిమా వాళ్లు రాజకీయ పార్టీల్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే కమెడీయన్ పృధ్వీ వైసీపీలో చేరారు. చేరడమే కాదు. వైసీపీ చేపట్టే దీక్షల్లో పాల్గొని టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న కమెడీయన్ కృష్ణుడు - అవకాశాలు లేక ఖాళీగా ఉన్న భానుచందర్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా అలీ.. వైసీపీ అధినేత జగన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరి మధ్య చాలాసేపు భేటీ జరిగింది. దీంతో.. అలీ కూడా వైసీపీలో చేరతారని భావిస్తున్నారు. అయితే.. ఇక్కడో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో ఉన్న కమెడీయన్స్ అందరూ ఇప్పుడు వైసీపీలోనే చేరుతున్నారు. రేపటి ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తాడన్న నమ్మకంతో.. వైసీపీని ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు ఇస్తే పోటీ చేస్తారు. లేదంటే.. అధికారంలోకి వచ్చాక.. ఏదో ఒక పదవి రాకపోతుందా అనే ఆశతో.. ఇప్పటినుంచే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇలా వరుసపెట్టి కమెడీయన్స్ మొత్తం ఒకేసారి చేరిపోతే.. వైసీపీ కమెడీయన్స్ పార్టీ అని టీడీపీ వర్గాలు విమర్శించేందుకు అవకాశం లేకపోలేదు.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?