7 +8..: 100.. 7.. 1.. 2.. పాక్ తో రేపటి మ్యాచ్ కోహ్లికెంతో ప్రత్యేకం

Update: 2022-08-26 13:30 GMT
ఎవరైనా ఆటగాడు ఫామ్ కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉంటే ఏం చేస్తాడు..? తాను అత్యుత్తమంగా ఆడిన రోజులను గుర్తు చేసుకుంటాడు. వీలైతే నాటి వీడియోలను చూస్తూ స్ఫూర్తి
పొందుతుంటాడు. మళ్లీ లయను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాలం బాగుండి తాను రాణించిన రోజుల్లో అండగా నిలిచిన వ్యక్తులను తలచుకుంటాడు. టీమిండియా మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లి ప్రస్తుతం అదే చేస్తున్నాడు. ప్రస్తుతం కెరీర్ లోనే అత్యంత క్లిష్ట పరిస్థతుల్లో ఉన్న అతడు.. రెండ్రోజుల్లో జరుగబోయే ఆసియా కప్ వంటి అత్యంత కీలక సమరాన్న
ఎదుర్కొననున్నాడు. ఈ నేపథ్యంలో ఫామ్ కోసం కఠినంగా శ్రమిస్తున్నాడు. ఇదే క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి డిప్యూటీగా తాను వ్యవహరించిన రోజులను గుర్తు
తెచ్చుకుంటున్నాడు.

అప్పట్లో ధోనికి ఉప సారథిగా మాజీ కెప్టెన్ ధోనీ సారథిగా ఉన్న రోజుల్లో చాలా ఏళ్లు విరాట్ కోహ్లి డిప్యూటీగా ఉన్నాడు. కోహ్లి దుమ్ము రేపే ఆటతో మ్యాచ్ ను ఓ ఒడ్డుకు తెచ్చేస్తే.. ధోనీ క్రీజులో దిగి ముగించేవాడు. వీరిద్దరూ కలిసి అలా ఫినిష్ చేసిన మ్యాచ్ లెన్నో ఉన్నాయి. అలా తాను అత్యుత్తమంగా ఆడిన తీరును కోహ్లి గుర్తుకు తెచ్చుకొంటున్నాడు. ధోనీ తో కలిసి చురుగ్గా వికెట్లమధ్య పరిగెత్తుతూ . అలవోకగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే కోహ్లి గురువారం రాత్రి ఓ ట్వీట్ చేశాడు.

తాను ధోని సారథ్యంలో ఆడిన కాలాన్ని గుర్తచేస్తూ అది తన కెరీర్ లో అత్యుత్తమ దశగా అభివర్ణించాడు.  "ఈ వ్యక్తికి ఉప సారథిగా ఉన్న సమయం.. నా కెరీర్‌లోనే బాగా ఎంజాయ్‌ చేసిన ఉత్తేజకరమైన రోజులు. మా భాగస్వామ్యాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనవే.7+18" అని హార్ట్‌ సింబల్‌తో ట్వీట్‌ చేశాడు. ధోనీ జెర్సీ నంబర్‌ 7 కాగా.. విరాట్‌ది 18. ఈ ట్వీట్‌కు వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్నప్పటి ఫొటో జత  చేశాడు. కాగా, కోహ్లి అండర్ 19 నుంచి జాతీయ జట్టులోకి వచ్చిన సమయంలో ధోనీనే కెప్టెన్. అలా అతడు ఆటగాడిగానే కాక సారథిగా ఎదగడంలోనూ ధోనీ పాత్ర ఉంది. కోహ్లీ కెరీర్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీ వద్ద సలహాలు కూడా తీసుకొన్నాడు. తాజాగా రెండు పర్యటనల నుంచి విశ్రాంతి తీసుకొన్న కోహ్లీ.. ఆసియాకప్‌లో ఈ నెల 28వ తేదీన పాక్‌తో జరిగే మ్యాచ్‌లో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

ఆసియా కప్.. కోహ్లికెంతో కీలకం యూఏఈ వేదికగా శనివారం నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.  మొదటి మ్యాచ్‌ శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ మధ్య జరగనుండగా.. ఆదివారం భారత్, పాక్ తలపడనున్నాయి. అయితే, పాక్ తో మ్యాచ్ కోహ్లికెంతో ప్రత్యేకం. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లి ఈసారైనా గాడినపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, పాకిస్థాన్ తో మ్యాచ్ కోహ్లికి 100వ టి20.

న్యూజిలాండ్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ కాక.. అంతర్జాతీయ క్రికెట్ లో 100 టి20లు ఆడిన రెండో ఆటగాడు కోహ్లి మాత్రమే కానున్నాడు. ఇంగ్లాండ్ టూర్‌లో కోహ్లీ తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆపై వెస్టిండీస్‌, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లకు సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో కోహ్లీ ఆడలేదు. గతంలో జరిగిన ఆసియా కప్పుల్లో ఈ పరుగుల యంత్రం 60 సగటుతో రాణించడం భారత్‌కు సానుకూలాంశం. అయితే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్‌.. తిరిగి ఫామ్‌ సాధించి ఈ టోర్నీలో చెలరేగిపోవాలని  అభిమానులు ఆశిస్తున్నారు.

మూడింట్లోనూ 100 మ్యాచ్ లు టెస్టులు, వన్డేల్లో ఇప్పటికే కోహ్లి 100 మ్యాచ్ ల సంఖ్యను చేరాడు. ఇప్పుడు టి20ల్లోనూ దానికి ఒక్కటే దూరంలో ఉన్నాడు. ఇలామూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌లు ఆడిన రెండో వ్యక్తిగా నిలువనున్నాడు. 100 టి20లు, టెస్టులు, వన్డేలు రాస్ టేలర్ మాత్రమే ఆడాడు. ఇక  కోహ్లీ మరో ఏడు సిక్సులు కొడితే.. టీ20ల్లో రోహిత్‌ తర్వాత 100 సిక్సులు బాదిన రెండో
భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ ఫార్మాట్‌లో మరో 374 పరుగులు చేస్తే.. 11వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా విరాట్‌ చరిత్రలో నిలిచిపోనున్నాడు.
Tags:    

Similar News