బాబు సలహాదారులుగా బిల్ క్లింటన్..టోనీ బ్లెయిర్?

Update: 2016-01-17 04:18 GMT
వినటానికి కాస్త వింతగా అనిపించినా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలహాలు ఇచ్చేందుకు విదేశీ ప్రముఖులు పలువుర్ని నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. బాబు ఛైర్మన్ గా ఏర్పాటయ్యే రాష్ట్ర ఆర్థిక మండలిలో సభ్యులుగా ఎంపిక చేసిన ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను చూస్తే విస్మయం చెందాల్సిందే. అంతర్జాతీయ వ్యవహారాల్లో బిజీగా ఉండే వీరంతా బాబుకు సలహాదారులుగా.. ఏపీకి సేవలు అందిస్తారన్న ప్రతిపాదన విస్మయాన్ని రేకెత్తించక మానదు.

నిజానికి సీఎం వద్దకు వచ్చిన ప్రతిపాదనకు ఓకే చెప్పేస్తే.. ఈ జాబితాలో ఉన్న వారంతా ఒక్కసారి అయినా కలిసే వీలుందా? అన్నది పెద్ద ప్రశ్న. అయినా.. సలహాదారులుగా ఉన్న ప్రముఖుల జాబితాను చూస్తే నోట వెంట మాట రాని పరిస్థితి. ప్రపంచ పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించిన బిల్ క్లింటన్.. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన టోనీ బ్లెయిర్ లాంటి వారు జాబితాలో ఉండటం గమనార్హం.

ఈ రెండు పేర్లే ఇంత షాకింగ్ గా ఉంటే.. జాబితాలో ఉన్నాయని చెబుతున్న మరికొన్ని పేర్లు వింటే నోట వెంట మాట రాని పరిస్థితి. ఏపీ అభివృద్ధికి ఈ ప్రముఖుల సలహాలు ఎలా సాయం చేస్తాయో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే.. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు సైతం అవగాహన ఉండే అవకాశమే లేదు. ఇంతకీ ఏపీ రాష్ట్ర ఆర్థిక మండలికి సలహాదారులుగా ప్రతిపాదించిన ప్రముఖల పేర్లను చూస్తే..

పరిపాలన రంగం

= బిల్ క్లింటన్

= టోనీ బ్లెయిర్

= ఎస్ నారాయణ

= ఫిలిప్ యో

= ప్రతాప్ భాను మెహతా

= అరుణ మైరాల

పరిశ్రమల రంగం

= బిల్ గేట్స్

= రతన్ టాటా

= ఎల్ నో మస్క్

= సత్య నాదెళ్ల

= ఇంద్రా రూయి

= సుందర్ పిచాయ్

= అనంద్ మహీంద్ర

= శివనాడార్

= ఆది గోద్రెజ్

= వైసి దేవేశ్వర్

= దీపక్ పారిఖ్

మౌలిక సదుపాయాల రంగం

= ఎ.ఎం నాయక్

= జి. రఘురామ్

= ప్రొఫెసర్ సెబాస్టియన్ మోరిస్

= అశ్వన్ మహాలింగం

= జగన్ షా

పబ్లిక్ ఫైనాన్స్ రంగం

= వై.వి. రెడ్డి

= సి. రంగరాజన్

= డి. సుబ్బారావు

= ఎం. గోవిందరావు

= వివేక్ పాథక్

= అశోక్ గులాటి

= అభిజిత్ బెనర్జీ

నైపుణ్య పారిశ్రామిక రంగం

= ఆర్.ఎ. మషేలక్కర్

= సంతోష్ మెహరొట్రా

= రాజన్ ఆనందన్

= ఎస్ పరశురామన్

= నందన్ నీలేకని

= వినోద్ ఖోస్లా
Tags:    

Similar News