టాప్ టెన్ సంప‌న్న ఆట‌గాళ్లు ఎవ‌రో తెలుసా..?

Update: 2017-01-02 08:09 GMT
ఏదో సాధించాల‌న్న క‌సితో క్రీడ‌ల్లోకి వ‌స్తారు! ఒక్క‌సారి ఆట‌లో విజ‌యం వ‌రించిందంటే చాలు... దానివెన‌కే సంప‌ద కూడా వ‌చ్చేస్తుంది. బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ఎండార్స్ మెంట్లు.. ప్రక‌ట‌న‌లు... స‌క్సెస్ ఫుల్ క్రీడాకారుల‌కు ఇలా ఎన్నో ర‌కాల ఆదాయ మార్గాలు వ‌చ్చేస్తాయి. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంప‌న్న ఆట‌గాళ్ల జాబితాను ఫోర్స్ ప‌త్రిక ఇటీవ‌లే విడుద‌ల చేసింది. 2016 సంవ‌త్స‌రానికిగాను టాప్-10 సంప‌న్న ఆట‌గాళ్ల వివ‌రాలు ఇప్పుడు చూద్దాం.

క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు తెలియ‌ని ఫుట్ బాల్ ప్రేమికులు ఉండ‌రు. స్టార్ ప్లేయ‌ర్‌ రొనాల్డో పోర్చుగ‌ల్ జ‌ట్టుకి కెప్టెన్ గా బాధ్య‌త‌లు నిర్వర్తిస్తున్నందుకు ఒక ఏడాదికి అత‌డికి వ‌చ్చే పారితోషికం ఎంతో తెలుసా.. రూ. 375 కోట్లు మాత్ర‌మే! ఇక‌, వివిధ సంస్థ‌ల‌కు ఎండార్స్ మెంట్లు - ప్ర‌క‌ట‌న‌లు వ‌గైరా వ‌గైరాల రూపంలో మ‌రో రూ. 214 కోట్లు వ‌స్తుంది. ఈ రేంజిలో సంపాద‌న ఉండ‌బ‌ట్టే ఫోర్స్ టాప్ టెన్ సంప‌న్న ఆట‌గాళ్ల జాబితాలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచాడు. రోనాల్డో తరువాతి స్థానాన్ని మెస్సీ ఆక్ర‌మించాడు. అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లొనెల్ మెస్సీ. ఇత‌గాడి వార్షిక ఆదాయం రూ. 358 కోట్లు. ప్ర‌క‌ట‌న‌లు ఇత‌ర మార్గాల ద్వారా సమ‌కూరే ఆదాయం మ‌రో రూ. 187 కోట్లు!

మూడో స్థానంలో లీబ్రోన్ జేమ్స్ ఉన్నాడు. ఈ బాస్కెట్ బాల్ ఆట‌గాడికి ఆట ద్వారా వ‌చ్చే ఆదాయం క‌న్నా... ఎండార్స్ మెంట్ల రూపంలో వ‌చ్చేదే చాలా ఎక్కువ‌! ఏటా రూ. 361 కోట్లు ఎండార్స్ మెంట్ల ద్వారానే వ‌స్తున్నాయి. ఆట ద్వారా వ‌చ్చే పారితోషికం రూ. 155 కోట్లు మాత్ర‌మే. త‌రువాతి స్థానంలో స్విస్ కి చెందిన టెన్నీస్ ప్లేయ‌ర్ రోజెర్ ఫెదెర‌ర్ ఉన్నాడు. ఈ ఆట‌గాడికి కూడా ఎండార్స్ మెంట్ల ద్వారా వ‌చ్చే సొమ్ము చాలా ఎక్కువ‌! ఎంత ఎక్కువ అంటే... ఆట ద్వారా వ‌చ్చే వార్షికాదాయం కంటే 8 రెట్లు ఎక్కువ‌. రూ. 52 కోట్లు మాత్ర‌మే ఆట ద్వారా ఫెదెరర్ కు వ‌స్తుంది. ఎండార్స్ మెంట్ల రూ. 402 కోట్లు తెచ్చిపెడుతున్నాయి.

అమెరికాలో మాంచి పాపులారిటీ ఉన్న బాస్కెట్ బాల్ ఆట‌గాడు కెవిన్ డ్యురాంట్‌. ఇత‌గాడి వార్షిక ఆదాయం రూ. 135 కోట్లు ఆట ద్వారా... రూ. 241 కోట్లు ఎండార్స్ మెంట్ల ద్వారా వ‌స్తుంది. టెన్సిస్ లో సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్న సెర్బియ‌న్ ప్లేయ‌ర్ జ‌కోవిచ్ కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడు. ఎండార్స్ మెంట్ల ద్వారా రూ. 227 కోట్లు... వార్షిక పారితోషికం రూపంలో రూ. 146 కోట్లు సంపాదిస్తున్నాడు. అమెరిక‌న్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ కేమ్ న్యూట‌న్ సంపాద‌న భారీ ఎత్తునే ఉంటోంది. అంద‌రికీ ఎండార్స్ మెంట్ల రూపంలో ఎక్కువ సొమ్ము వ‌స్తుంటే... న్యూటన్ కి జీతం రూపంలోనే అంత‌కంటే ఎక్కువ వ‌స్తోంది. రూ. 274 కోట్లు వార్షికాదాయం జీతం రూపంలో వ‌స్తోంది. ఎండార్స్ మెంట్ల ద్వారా రూ. 80 కోట్లు సంపాదిస్తున్నాడు.

అమెరికాకు చెందిన ప్రొఫెష‌న‌ల్ గోల్ఫ్ ఆట‌గాడు ఫిల్ మికెల్స‌న్‌. ఈయ‌న్ని ఎండార్స్ మెంట్ కింగ్ అనొచ్చు. కేవ‌లం ఎండార్స్ మెంట్ల ద్వారా ఏడాదికి రూ. 335 కోట్లు ఆర్జిస్తున్నాడు.  జీతం రూపంలో ఫిల్ కి ఒక ఏడాదికి వ‌చ్చేది కేవ‌లం రూ. 19 కోట్లు మాత్ర‌మే. ఈయ‌న త‌రువాతి స్థానంలో మ‌రో గోల్ఫ్ ఆట‌గాడు జోర్డ‌న్ స్పీత్ ఉన్నాడు. యాన్యువ‌ల్ ప్యాకేజ్ రూ. 139 కోట్లు... ఎండార్స్ మెంట్లు రూ. 214 కోట్లు! స్పీత్ త‌రువాత ప్రొఫెష‌న‌ల్ బాస్కెట్ బాల్ ఆట‌గాడు బ్రంట్ ఉన్నాడు. ఈ అమెరిక‌న్ ఆట‌గాడు రూ. 167 కోట్లు ఎండార్స్ మెంట్ల ద్వారా ఏడాదికి సంపాదిస్తే... అంతే మొత్తాన్ని ఆట‌కి పారితోషికంగా తీసుకుంటున్నాడు. సో... ఇదీ ఫోర్స్ జాబితాలోని టాప్ టెన్ సంప‌న్న ఆట‌గాళ్ల జాబితా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News