గూగుల్‌..ఎఫ్‌ బీ..ట్విట్ట‌ర్ సీఈవోల జీతాలెంత‌?

Update: 2016-04-16 09:41 GMT
ప‌దేళ్ల నుంచి జీతాల గురించిమాట్లాడుకోవ‌టం ఎక్కువైంది. ఎప్పుడైతే ఐటీ బూమ్ పెరిగిందో.. అప్ప‌టి నుంచి భారీ జీతాల గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌టం మొద‌లైంది. ఐఐటీ క్యాంపస్ ఇంట‌ర్వ్యూలో సెల‌క్ట్ అయిన విద్యార్థికి ల‌క్ష‌ల్లో జీతాలంటూ వార్త‌లు రావ‌టం లాంటివి చూసిన‌ప్పుడు ప్ర‌పంచాన్ని శాసిస్తున్న కొన్ని కంపెనీల్ని నిర్వ‌హించే నిర్వాహ‌కుల జీతాల ఏస్థాయిలోఉంటాయా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ప్ర‌పంచ ఐటీ రంగానికి ద‌శ‌..దిశ‌ను నిర్దేశించే మైక్రోసాప్ట్ కావొచ్చు.. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో కింగ్ లాంటి ఫేస్ బుక్‌.. సెర్చింజ‌న్ లో ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాతి గాంచిన గూగుల్ సీఈవోల‌కు జీతాలు ఎంతేసి ఉంటాయి? అన్న డౌట్ వ‌చ్చిందా? అలాంటి డౌట్ కు తీర్చుకునేందుకు వెత‌క‌టం మొద‌లు పెడితే ఆస‌క్తిక‌ర స‌మాచారం ల‌భించింది. సోష‌ల్ మీడియాలో సుప‌రిచిత‌మైన ఫేస్ బుక్‌.. ట్విట్ట‌ర్ విష‌యాల‌కు వ‌స్తే.. ట్విట్ట‌ర్ సీఈవో  జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోడ‌ట‌.కాకుంటే త‌న వ్య‌క్తిగ‌త.. ఇంటి భ‌ద్ర‌త కోసం మాత్రం నెల‌కు రూ.46 ల‌క్ష‌లు తీసుకుంటాడ‌ట‌. ఇక ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ జీతం కూడా అంతే. అత‌గాడి వార్షిక జీతం కేవ‌లం రూ.68 మాత్ర‌మే. అంత‌పెద్ద పొజిష‌న్లో ఉండి కూడా అస్స‌లు జీతం అన్న‌ది తీసుకోకుండా ఉండ‌టం కాస్త చిత్ర‌మే క‌దూ.

ఇక‌.. భారీగా జీతాలు తీసుకునే ప్ర‌ముఖ‌ల్ని చూస్తే.. (ఏడాదికి)
=  మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు.. స‌ల‌హాదారు  బిల్ గేట్స్ వార్షిక జీతం రూ.78వేల‌296కోట్ల 83ల‌క్ష‌ల‌33వేల‌333
= గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ జీతం రూ.669కోట్ల 84 ల‌క్ష‌ల 20 వేల 475
=  మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల జీతం రూ.573కోట్ల 94ల‌క్ష‌ల 25వేలు
= యాహు సీఈవో మ‌రిస్సా మేయిర్ రూ.289కోట్ల 95ల‌క్ష‌లు
= యాపిల్ సీఈవో టీమ్ కుక్ జీతం రూ.62కోట్ల 77ల‌క్ష‌ల 28 వేల 333
Tags:    

Similar News