ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నిలిచారు. కరోనా వేళ.. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్న వేళలో.. కుబేరుల సంపద మరింత పెరిగిందే తప్పించి తగ్గలేదు. ఫోర్బ్స్ సంస్థ 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. మన రూపాయిల్లో రూ.7350 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న వారు ప్రపంచ వ్యాప్తంగా 2755 మంది ఉన్నట్లుగా గుర్తించింది. గత ఏడాది మొత్తం బిలియనీర్ల సంపద కంటే.. ఈ ఏడాది బిలయనీర్ల మొత్తం ఆస్తి చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఈ ఏడాది మొత్తం బిలియనీర్ల సంపద 13.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నట్లుగా అంచనా వేశారు. గత ఏడాది 8లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే ఏకంగా 5 లక్షల కోట్ల డాలర్లు పెరగటం చూస్తే.. సంపన్నుల ఆదాయం కరోనా కష్టకాలంలో ఎంత భారీగా పెరిగిందో ఇట్టే అర్థమవుతుంది.
గత ఏడాది 31వ స్థానంలో ఉన్న టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తాజా జాబితాలో రెండో స్థానంలో నిలిస్తే.. తొలిసారి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వారెన్ బఫెట్ తొలి ఐదు స్థానాల్లో చోటు లభించలేదు. చైనా వ్యాపార దిగ్గజం అలీబాబా చీఫ్ జాక్ మా 26వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల విషయానికి వస్తే..
ర్యాంక్ వ్యక్తి పేరు నికర సంపద (బి.డాలర్లలో)
1. జెఫ్ బెజోస్ 177
2. ఎలాన్ మస్క్ 151
3. బెర్నార్డ్ ఆర్నాల్డ్ 150
4. బిల్ గేట్స్ 124
5. మార్క్ జుకర్ బర్గ్ 97
6. వారెన్ బఫెట్ 96
7. లారీ ఎలిసన్ 93
8. లారీ పేజ్ 91.5
9. సెర్గీ బ్రిన్ 89
10. ముకేశ్ అంబానీ 84.5