పిల్ల‌ల కండిష‌న్ పై సుప్రీం నో చెప్పేసింది

Update: 2019-02-25 11:24 GMT
ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ‌.. ప‌లువురు నేత‌ల‌కు షాకిచ్చే నిర్ణ‌యాన్ని తెర మీద‌కు తెచ్చేలా బీజేపీ నేత ఒక‌రు సుప్రీంలో దాఖ‌లు చేసిన పిటిష‌న్ కు సుప్రీంకోర్టు నో చెప్పేసింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మించి ఉన్న నేత‌ల్ని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ఉండేలా రాజ‌కీయ పార్టీల‌కు ఆదేశాలు ఇచ్చేలా ఈసీకి చెప్పాలంటూ  బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనికి సుప్రీంకోర్టు నో చెప్పేసింది.

ఈ పిటిష‌న్ ను విచారించిన సంద‌ర్భంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజ‌న్ గొగోయ్ క్లారిటీ ఇస్తూ.. ఇలాంటి ఆదేశాల్ని పార్టీల‌కు ఇవ్వ‌లేమ‌న్నారు. ఇది రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన కోర్టు అని.. ఇద్ద‌రు పిల్ల‌ల కంటే ఎక్కువ ఉన్న వారిని పోటీకి నిల‌బెట్ట‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేయ‌టం స‌రికాద‌న్నారు. దీంతో.. బీజేపీ నేత చేసిన ప్ర‌య‌త్నం నీరు కారిన‌ట్లే.

Tags:    

Similar News