ఎన్నికలు దగ్గరపడేకొద్దీ వలసలు, కొత్త కొత్త చేరికలు పార్టీల్లో ఎక్కువ అవుతున్నాయి. అయితే..టీడీపీ నుంచి అందరూ బయటకు వస్తుంటే.. బయట వాళ్లంతా వైసీపీలోకి వెళ్తున్నారు. అయితే.. ఎంతమంది నాయకులు వచ్చినా సినిమా వాళ్ల గ్లామర్ సినిమా వాళ్లతే. వాళ్ల వల్ల ఓట్లు వస్తాయో రావో తెలీదు కానీ.. వాళ్లు సభలకు వస్తున్నారంటే.. జనం మాత్రం విపరీతంగా వస్తారు. అందుకే ఇప్పుడు చాలామంది సినిమా వాళ్లు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ కూడా చేరాడు. మరికొన్ని రోజుల్లో దాసరి అరుణ్ వైసీపీలో చేరబోతున్నాడట. ఈ విషయాన్ని కమెడియన్ పృధ్వీయే మీడియాకు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కోసం దాసరి అరుణ్ ప్రచారం కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు.
దాసరి సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు దాసరి అరుణ్‌కుమార్. హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు. మధ్యలో విలన్ గా కూడా కన్పించినా.. ఎందుకో అరుణ్ మాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. సినిమాలకు దూరంగా ఉంటున్న అరుణ్.. ఇప్పుడు వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి రాబోతున్నాడు. గతంలో.. దాసరి వైఎస్ కు మంచి అనుబంధం ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాసరి కేంద్రమంత్రిగా ఉన్నారు. అన్నింటికి మించి.. దాసరికి, వైఎస్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. అదీగాక.. పాదయాత్రకు ముందు దాసరి ఆశీస్సులు తీసుకున్నారు జగన్. సో.. పాత పరిచయాల దృష్ట్యా పార్టీలో అరుణ్‌కి జగన్ సముచిత స్థానమే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.