నెంబర్ వన్ ఇంగ్లిష్ కాదు.. మరేమిటి?

Update: 2016-08-15 13:42 GMT
ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ప్ర‌జ‌లు ఏ భాష‌ను మాట్లాడ‌తారు? ఈ  ప్రశ్న‌కు ఏమాత్రం త‌డుముకోకుండా ఠ‌క్కున చెప్పేసే స‌మాధానం ఏంటంటే... ఇంగ్లిష్‌! కానీ - ఇది నిజం కాదు. అవును, ఇంగ్లిష్ మాట్లాడేవారు ఎక్కువ‌గా ఉండొచ్చు, దాదాపు అన్ని దేశాల్లోనూ ఉండొచ్చు - కానీ.. ఇతర భాష‌ల‌తో పోల్చితే ఆంగ్లం మాట్లాడేవారి సంఖ్య మాత్రం త‌క్కువే అని ప్ర‌పంచ ఆర్థిక ఫోక‌ర్ తేల్చి చెప్పింది.

నిజానికి - ఇంగ్లిష్ భాష 110 దేశాల్లో ఉంది. కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల కింద‌ట బ్రిటిష్ పాల‌కుల ఈ భాష‌ను చాలా దేశాల‌కు వ్యాప్తి చేశారు. నాడు వారు పాలించిన ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు ఇంగ్లిష్‌ ను ప‌రిచ‌యం చేశారు. అలా ఇంగ్లిష్ బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. సంఖ్యాప‌రంగా చూసుకుంటే 33.50 కోట్ల ప్ర‌జ‌లు ఇంగ్లిష్‌ లో మాట్లాడుతున్నారు. అంత‌మాత్రాన ఇంగ్లిష్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో లేదు! మూడో స్థానంలో ఉంది. మ‌రి, టాప్ టు స్థానాల్లో ఉన్న భాష‌లు ఏవ‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

జ‌నాభాప‌రంగా చూసుకుంటే చైనా అతిపెద్ద దేశం. సో... ఆ దేశంలో ఎక్కువ‌మంది చైనీస్ మాట్లాడ‌తారు. చైనాతోపాటు హాంగ్‌ కాంగ్‌ - తైవాన్‌ - మలేసియాల్లో కూడా ఇదే భాష. ఆ విధంగా చైనీస్ మాట్లాడుతున్న‌వారి సంఖ్య 100 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఆ విధంగా చైనీస్ నంబ‌ర్ వ‌న్ స్థానం ద‌క్కించుకుంది. త‌రువాతి స్థానం స్పానిష్ భాష‌ది. 35 దేశాల్లో ప్ర‌జ‌లు దీన్ని మాట్లాడ‌తారు. దాదాపు 33.90 కోట్ల మంది ఈ భాష‌లోనే సంభాష‌ణ‌లు సాగిస్తున్నారు. దీని త‌రువాత‌, అంటే మూడోస్థానంలో ఇంగ్లిష్ ఉంది. జ‌న సంఖ్యాప‌రంగా చూసుకుంటే 33.50 కోట్ల మంది ఆంగ్లం అర్థ‌మౌతోంది. ఇక‌, త‌రువాతి స్థానం అర‌బిక్ ఆక్ర‌మించింది. 60 దేశాల్లోని 24.20 కోట్ల‌మంది ప్ర‌జ‌లు అర‌బిక్‌ లో మాట్లాడుకుంటున్నారు. ముస్లిం పాల‌కులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించారు కాబ‌ట్టి, అర‌బిక్ ఆయా దేశాల‌కు ప‌రిచ‌యం అయింది. ఏడో శ‌తాబ్దంలో అర‌బిక్ వివిధ ప్ర‌పంచ దేశాల‌ను ప‌రిచ‌యం అయింది. అయితే, ప్ర‌స్తుతానికి ఇంగ్లిష్ 3వ స్థానంలో ఉన్నా కూడా దాదాపు 150 కోట్ల మంది ఆ భాష‌లోనే చ‌దువుకుంటున్నారు. సో.... భ‌విష్య‌త్తులో ఇంగ్లిష్ మాట్లాడేవారి సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు
Tags:    

Similar News