ఏపీలో పుష్క‌రస్నానం చేసిన భ‌క్తుల లెక్క‌లివే

Update: 2016-08-23 17:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలు మంగ‌ళ‌వారంతో ముగిశాయి. ఏపీ ప్ర‌భుత్వం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా కృష్ణా పుష్క‌రాల కోసం ఏర్పాట్లు చేసింది. ఆగ‌స్టు 12 నుంచి ప్రారంభ‌మైన ఈ పుష్క‌రాలు 12 రోజుల పాటు క‌నివినీ ఎరుగ‌ని రీతిలో జ‌రిగి మంగ‌ళ‌వారం సాయంత్రంతో ముగిశాయి. రెండు తెలుగు స్టేట్‌ల‌లో పుష్క‌రాల సంద‌ర్భంగా భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించినా తెలంగాణ‌తో పోల్చుకుంటే ఏపీలోనే పుష్క‌రాల‌కు ఎక్కువ క్రేజ్ ల‌భించింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఏపీలోనే ఎక్కువ మంది భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించి, త‌మ మొక్కులు తీర్చుకున్నారు.

 ఇక పుష్క‌రాల సంద‌ర్భంగా ఏపీలో ఎంత‌మంది భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించారో లెక్క‌లు అప్పుడే వ‌చ్చేశాయి. మొత్తం 12 రోజుల్లో 1,91,53,792 మంది భక్తులు పుష్కరస్నానం చేశారు. వివిధ జిల్లాలలో పుష్కరస్నానం చేసిన వారి సంఖ్య ఈ విధంగా ఉంది. పుష్క‌రాల‌కు కీల‌క కేంద్ర‌మైన విజ‌య‌వాడ‌లో 77,08,561 - కృష్ణా జిల్లాలోని వివిధ ఘాట్ల‌లో  28,25,926 స్నానాలు చేశారు.

 ఇక గుంటూరు(అర్బన్‌)లో 11,64,387 మంది- గుంటూరు జిల్లాలోని రూర‌ల్ ప్రాంతాల‌లోని ఘాట్ల‌లో 60,24,973 మంది పుణ్య‌స్నానాలు ఆచ‌రించారు. కర్నూలు జిల్లాలో 14,29,945 మంది పుష్కరస్నానం చేశారు. ఇక పుష్క‌రాల ముగింపు సంద‌ర్భంగా ప‌విత్ర పుష్క‌ర ఘాట్‌లో ప‌విత్ర హార‌తికి భ‌క్తులు పోటెత్తారు. సీఎం చంద్ర‌బాబు, స్టేట్ మంత్రుల‌తో పాటు ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేష్‌ప్ర‌భు, ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ వెంక‌య్య‌నాయుడు సైతం హాజ‌ర‌య్యారు.  

   ఇక రియోలో ర‌జ‌త ప‌త‌క విజేత పీవీ సింధును పుష్క‌రాల ముగింపు కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు దంప‌తులు స్టేట్ గ‌వ‌ర్న్‌మెంట్ త‌ర‌పున ఘ‌నంగా స‌త్క‌రించ‌డంతో పాటు ఆమెకు ప్ర‌భుత్వం త‌ర‌పున ఇచ్చిన రూ.3 కోట్ల చెక్ అంద‌జేశారు. భువ‌నేశ్వ‌రి ఆమెకు బెజ‌వాడ దుర్గ‌మ్మ ప్ర‌సాదం - రైల్వే మంత్రి సురేష్ ప్ర‌భు ఆమెకు సీఆర్‌ డీఏలో కేటాయించిన వెయ్యి గ‌జాల స్థ‌లం ప‌త్రాన్ని అంద‌జేశారు. సింధు కోచ్ గోపీచంద్‌కు రూ.50 ల‌క్ష‌ల చెక్, ఒలింపిక్‌లో పాల్గొన్న శ్రీకాంత్‌కు రూ.25 ల‌క్ష‌ల చెక్‌ను బాబు అంద‌జేశారు.
Tags:    

Similar News