ఉరిశిక్ష‌ను ర‌ద్దు చేసే ప్ర‌స‌క్తే లేదు!

Update: 2019-07-14 05:25 GMT
కీల‌క వ్యాఖ్య చేశారు కేంద్ర స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి. తీవ్ర‌మైన నేరాలు చేసే వారికి విధించే ఉరిశిక్ష‌కు సంబంధించి ఆయ‌న తేల్చేశారు. ఇటీవ‌ల కాలంలో ఉరిశిక్ష‌ను ర‌ద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయ‌న తాజాగా స్ప‌ష్ట‌త ఇచ్చారు.

చిన్నారుల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడులు.. హ‌త్య‌ల‌ను అరిక‌ట్టాల‌ని చెప్పిన వారిని ఉద్దేశించి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత దారుణ‌మైన నేరాల‌కు పాల్ప‌డే వారి విష‌యంలో ఉరిశిక్ష స‌రైన‌దేన‌ని చెప్పారు. ఈ అంశంపై తాను వ‌చ్చే శుక్ర‌వారం పార్ల‌మెంటులో స‌మాధానం ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.

ఉరిశిక్ష అమ‌లు చేసే విష‌యంలో చాలా స‌మ‌యం ప‌డుతున్న కార‌ణంగా.. కేసులు త్వ‌ర‌గా ప‌రిష్కరించేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. జ‌మ్ముక‌శ్మీర్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ట్టాల్లో మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లుగా చెప్పారు. ఉరిశిక్ష ర‌ద్దు విష‌యంపై క్లారిటీతో పాటు.. ఆ శిక్ష‌ను మ‌రింత వేగంగా అమ‌లు చేస్తామ‌న్న కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News