అమెరికా కలల జాబ్ కు అవకాశం ఈ రోజు నుంచి షురూ కానుంది. చాలామంది ఉద్యోగులు.. అమెరికాకు వెళ్లాలని తపిస్తుంటారు. ఇలాంటి వారికి హెచ్ 1బీ వీసా ఒక వరం. ఈ ఏడాదికి సంబంధించి ఈ రోజు నుంచి వీసా జారీ కార్యక్రమాన్ని అమెరికన్ కాన్సులేట్ చేపట్టనుంది. అయితే.. గతంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత భారీగా హెచ్ 1బీ వీసా దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరీక్షలు చేయనున్నారు. శల్య పరీక్షలు ఎదురుకానున్న నేపథ్యంలో ఎంతమంది వీసా కలలు సాకారం అవుతాయన్నది ప్రశ్నగా మారింది.
హెచ్1బీ వీసాల జారీ కార్యక్రమం ప్రారంభం కానున్న వేళ.. ఈసారి కొత్త తరహా విధానాల్ని అనుసరిస్తారని చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష కుర్చీలో డొనాల్డ్ ట్రంప్ కూర్చున్న నేపథ్యంలో.. విదేశీ ఉద్యోగులు అమెరికాలో జాబ్ చేసేందుకు వచ్చే వారికి కఠిన పరీక్షలు నిర్వహించిన తర్వాతే వీసాలు జారీ చేయాలన్న విస్పష్ట ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు.. చిన్న చిన్న తప్పులను కూడా ఉపేక్షించొద్దని యూఎస్ సీఐఎస్ బలమైన సంకేతాల్ని పంపినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ 1బీ వీసాల కోసం ప్రయత్నించే వారు కఠిన పరీక్షలు ఎదురు కావొచ్చని చెప్పక తప్పదు. ఏటా 65 వేల వీసాల్ని అమెరికా జారీ చేస్తుంది. ఇందులో అత్యధికం భారత్.. చైనా నుంచే పొందుతుంటారు. అంతేకాదు.. ఈ వీసాలకు సంబంధించి వివిధ కంపెనీలు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తుంటారు.
ఒకటి మిస్ అయినా మరొకటి వస్తుందన్న ఆశతో. అయితే.. ఇలాంటి వాటికి చెక్ పెడుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ వీసాలు దరఖాస్తు చేస్తే రిజెక్ట్ చేయటం ఖాయమని అమెరికా పౌర సేవల సంస్థ స్పష్టం చేస్తోంది.
ఈ రోజు నుంచి జారీ చేసే హెచ్ 1బీ వీసాలకు సంబంధించి.. భారతీయులు గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అత్యంత నైపుణ్యమున్నభారత సిబ్బందికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత కంపెనీలు దరఖాస్తు చేసే వాటిని మరింత నిశితంగాపరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హెచ్ 1బీ వీసా జారీ విషయంలో భారతీయులకు కఠినమైన పరీక్షలు తప్పవని చెబుతూనే.. మిగిలిన దేశాల వారితో పోలిస్తే భారత కంపెనీలే వీసా రుసుమును అధికారంగా చెల్లించాల్సి ఉండటం గమనార్హం. ఇవన్నీ చూసినప్పుడు హెచ్ 1బీ వీసాల జారీలో భారత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్పక తప్పదు. మరీ.. గడ్డు పరిస్థితిని మనోళ్లు ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే. సాధించాలన్న పట్టుదలతో పాటు.. తెల్లోడి తెలివికి మించేలా.. వారి మనసుల్ని దోచుకునేలా హెచ్ 1బీ వీసాల్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీసాల కోసం ప్రయత్నించే వారందరికి బెస్టాప్ లక్.