ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలవుతోందా... ఈసారి సరిహద్దు సమస్య ఏర్పడనుందా... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ తప్పదా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తాజాగా చెలరేగిన ఓ వివాదం సరిహద్దు వివాదంగా మారొచ్చన్న భావన పలు వర్గాల నుంచి వినిపిస్తోంది.
నాగార్జునసాగర్ సమీపంలోని అనుపు దగ్గర బోట్ల తయారీకి తెలంగాణ టూరిజం ఉద్యోగులు మంగళవారం వచ్చారు. మొత్తం మూడు లారీల్లో ఆయా సామాన్లతో టూరిజం సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అధికారులు అడ్డుకున్నారు. ఆంధ్రా భూభాగంలో బోట్లు ఎలా నడుపుతారంటూ ప్రశ్నించారు. అదే హుస్సేన్ సాగర్ లో తాము బోట్లు నడిపితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. దీంతో అటు అంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ టూరిజం అధికారులు అక్కడకు చేరుకొని వాగ్వాదానికి దిగారు.
విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గతంలో నారార్జునసాగర్ గేట్లు తెరిచే విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. రెండు రాష్ట్రాల పోలీసులు అక్కడ మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ప్రారంభమైంది. తరచూ సరిహద్దు వివాదాలు వస్తుండడంతో నియంత్రణ రేఖ ఏర్పాటు చేయాలేమో...?