రేవంత్ రానే వచ్చారు.. గ్యాంగ్ రేప్ కేసులో కీలక పాయింట్లు లేవనెత్తారు..
ఘటనకు సంబంధించి కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతున్నారని ఆరోపించారు.గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి మంగళవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వీటినే ఆధారంగా చేసుకుని ఆనంద్ ప్రశ్నలు సంధించారు. కేసులో వాహన యజమానుల వివరాలను కమిషనర్ ఆనంద్ ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ గల నెల ఆఖరులో అమెరికా వెళ్లారు. తొలుత వారం రోజులు అనుకున్నఆయన పర్యటన మరికొన్ని రోజులు పెరిగింది. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడినుంచే మీడియాతో మాట్లాడారు.
కార్లే కీలకమైతే.. యజమానులపై ఏం చర్యలు చేపట్టారు..
గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన వాహనాలు బెంజ్, ఇన్నోవా అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్లే కీలక ఆధారాలు అని రేవంత్ పేర్కొన్నారు. పోలీసులు ఈ కారులో ఉన్నవారు మైనర్ల ని చెబుతున్నారని.. అలాంటవారు వాహనాలు నడిపినప్పుడు యజమానులు వాహనాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రస్తావించారు. ''తక్షణమే యజమానులు పోలీసు అధికారులకు సమాచారం అందించాలి. మోటర్ వాహన చట్టం 133 ప్రకారం యజమానులకు నోటీసులు ఇచ్చి, వారిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించి.. జరిగిన వివరాలు తెలియజేసి కేసు నమోదు చేయాల్సిన అవసరముంది.
బెంజికారు పబ్ వరకు వెళ్లిన తర్వాత ఇన్నోవాలో బయల్దేరారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. విచారణ అధికారిగా సీపీ మార్చి 20 నుంచి మే 28వ తేదీ సాయంత్రం సంఘటనలు జరిగినంత వరకు మాత్రమే విచారణ అంశాలను మీడియాకు వివరించారు. అసలు కథ మొదలైంది మే 28న 7.53 గంటల తర్వాతే. బాధితురాలిని తండ్రి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కార్లలో జరిగిన ఘటన, పెద్దమ్మ గుడి ప్రాంతంలో జరిగిన తతంగం వివరాలు.. దీనికి సంబంధించిన వాహనాలు ఎక్కడివి, వాహనాల యజమానుల మీద తీసుకున్న చర్యలేమిటో సీవీ ఆనంద్ చెప్పకుండా కప్పిపుచ్చారు. ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి అపాయింట్ చేసిన వక్ఫ్‌బోర్డు ఛైర్మన్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ చిన్న ఘటన జరిగినా స్పందించే అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పొత్తులలో భాగస్వాములు, ఎన్నికల్లో భాగస్వాములు, ప్రభుత్వంలో భాగస్వాములు. చివరికి రేప్‌లు, మర్డర్లలో కూడా భాగస్వాములయ్యారు''అని రేవంత్ ధ్వజమెత్తారు.
అసలు బెంజి ఓనర్ ఎవరో చెప్పలేదేమిటి?
కారు యజమానులను పోలీసులు పిలిచి విచారించారా? లేదా? ఎంవీ యాక్టు 133 ప్రకారం మైనర్లు కార్లు నడిపితే యజమానులకు నోటీసులు ఇవ్వాలి.. ఇచ్చారా? అని రేవంత్ నిలదీశారు. బెంజి ఎంఐఎంకు సంబంధించిన వారిదని ఆరోపణలు వస్తున్నప్పడు సీవీ ఆనంద్ మెర్సిడిస్ బెంజికారు యజమాని ఎవరో చెప్పలేదేమని ప్రశ్నించారు. మైనర్లు కార్లు నడపకపోతే ఘటనకు సహకరించిన వాహనాల యజమానులపై కూడా పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి. ఘటన జరిగిన ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమని స్పష్టమైంది. కమిషనర్ కూడా చెప్పారు.
ఇన్నోవా కారులో డ్రైవర్ లేరని స్పష్టంగా చెప్పారు. డ్రైవర్ లేనప్పుడు కారును నడిపింది మైనర్లు. మైనర్లందరూ కలిసి కారు పెద్దమ్మగుడి ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పారు. వాహన యజమానుల వివరాలను సీవీ ఆనంద్ ఎందుకు దాచిపెడుతున్నారు. ప్రభుత్వ వాహనాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తే కారుకు సంబంధించిన వివరాలను ఎందుకు కప్పిపుచ్చుతున్నారు.
అత్యాచారం కేసులో కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతున్నారు. వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు. ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఇన్నోవా కారు ఎక్కడుంది? ఇన్నోవా కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్ తొలగించారు. రేప్ ఘటనతో పాటు ఉద్దేశపూర్వకంగా ఆధారాలు చెరిపే ప్రయత్నం చేశారు. వాహనాన్ని ఎక్కడ స్వాధీనం చేసుకున్నారో పోలీసులు వెల్లడించలేదు'' అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
రేవంత్ లేక కాంగ్రెస్ ఢీలా.. మిగతావారి సత్తా ఏమిటో తెలిసొచ్చింది
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన అత్యంత దారుణం. ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టే ఘటన. దీనిని తెలంగాణ బీజేపీ నేతలు అందిపుచ్చుకున్నంతగా కాంగ్రెస్ నేతలు పట్టుకోలేకపోయారు. వారి నుంచి సరైన స్పందనే లేదు. రేవంత్ విదేశీ టూర్ లో బిజీగా ఉండడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ దారుణంపై మాట్లాడే నాయకుడే లేకుండా పోయాడు.
ఓవైపు బీజేపీ రఘునందన్ రావు వంటి నాయకుడిని ముందుపెట్టి తీవ్రంగా ధ్వజమెత్తతుంటే కాంగ్రెస్ మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది. టీఆర్ఎస్ సర్కారును పూర్తిగా ఆత్మరక్షణలో పడేయాల్సిన సందర్భంలో ఇలా చేతులెత్తేయడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. అంతేగాక.. ప్రభుత్వంపై పోరాడుతున్న రఘునందన్ పైకి నిరసనల రూపంలో వెళ్లడం మరింత ఇబ్బందిగా కనిపిచింది. అంటే.. రేవంత్ లేకుంటే రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఇంతేనా? ముఖ్యమైన సందర్భం, సమయం వచ్చినప్పుడు గట్టిగా నిలదీసేవారే లేరా? అనే ప్రశ్నలు వచ్చాయి.