రాజకీయాల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు.. నాయకులకు బాధను కలిగిస్తాయి.. ఇబ్బందిగా కూడా ఉంటాయి. కానీ.. అవి వాస్తవ రూపంలోకి వచ్చి.. ఫలితం అందుకున్నాక మాత్రం.. ఆ తేడా అర్ధమవుతుంది. కానీ, ఈ మధ్యలో గ్యాప్ ను అర్ధం చేసుకోవడంమాత్రం నాయకులకు ఒకింత ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది.
అయితే.. కొందరు సీనియర్లు మాత్రం.. `మేమే మూలస్తంభాలం` అంటూ హల్చల్ చేస్తున్నారు. దీంతో 2014కు ముందు రాష్ట్రం ఇచ్చినప్పటికీ.. పార్టీ ఇప్పటి వరకు ఎదుగుబొదుగు లేకుండా అక్కడే ఉంది. దీనిని గమనించిన పార్టీ అధిష్టానం.. తెలంగాణ పగ్గాలను.. యువ నాయకుడు.. ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డికి అప్పగించింది. అయితే.. ఈయన టీడీపీ మనిషి అని.. ఈయనకు పార్టీ ప్లేవర్ లేదని.. సీనియర్లు గోల ప్రారంభించారు. ఎట్టకేలకు.. ఆయననే పార్టీ చీఫ్గా ఉంచుతూ.. పార్టీ అధిష్టానం తీర్మానం చేసి హెచ్చరిచంఇంది.
అయినా కూడా.. నాయకులు ఎక్కడా పట్టించుకోవడం లేదు. రేవంత్‌పై ఒంటికాలిపై లేస్తూనే ఉన్నారు. తాజాగా పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకురేవంత్ తనకున్న పరిచయాలను వినియోగించుకుంటున్నారు. అయితే.. ఈ దూకుడుతో రేవంత్ ఎదిగిపోతున్నారనిభావిస్తున్న ఇతర నాయకులు.. ఆయనకు చెక్ పెట్టేందుకు ఈ చేరికలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఖమ్మం, హైదరాబాద్‌లో జరిగిన చేరికలపై తీవ్ర వివాదమే సృష్టించారు.
తాటి వెంకటేశ్వర్లు, జడ్చర్ల నుంచి ఎర్రశేఖర్ వంటి వారి చేరికపై కొంత మంది అసంతృప్తి వినిపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయంలో రేవంత్ తీరుపై మండి పడినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఇలాంటి వ్యతిరేక స్వరాలకు పార్టీ అధిష్టానం ఆదిలోనే చెక్ పెట్టింది. రేవంత్ చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని.. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్.. మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. ఇక, తరచుగా.. నోరు పారేసుకుని.. రోడ్డెక్కుతున్న జగ్గారెడ్డి వంటివారి విషయంలోనూ పార్టీ సంచలన నిర్ణయం తీసుకునేదిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇలాంటి దూకుడు రాయుళ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. ``పది మందిని మెప్పించలేరు. పదిమందిని పరప్పించలేరు. ఇలాంటి వారు కేవలం ఇంటికి పొగపెట్టడం తప్ప.. మరేమీ కనిపించడం లేదు. ఇలాంటి వారిని పార్టీలో ఉంచడం కూడా వేస్ట్`` అని పలువురు నాయకులు సైతం అభిప్రాయపడుతుండడం గమనార్హం. సో.. మొత్తానికి రేవంత్ హవాకే అధిష్టానం మొగ్గు చపుతున్న నేపథ్యంలో ఆయనకు తిరుగులేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.