మాట్లాడే మాట ఆచితూచి ఉండాల్సిన చోట అనవసరమైన ఆవేశానికి పోతే మొదటికే మోసం వస్తుంది. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో ఉన్న వారు ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగులేస్తుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు బ్యాలెన్స్ మిస్ అయి వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా తమిళ.. తెలుగు నటి.. తమిళనాడు కాంగ్రెస్ ప్రచారకార్యదర్శి కుష్బు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న హిజ్రా భారతి కన్నమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కుష్బు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హిజ్రాలను కించపరిచేలా మాట్లాడారని.. ఎన్నికల్లో పోటీ చేసే అర్హతలపై చేసిన వ్యాఖ్యలు సరికావంటూ భారతి కన్నమ్మ కోర్టుకు ఎక్కారు.
ఈ కేసుపై జరిగిన విచారణలో కన్నమ్మ తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. ఈ కేసును కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. కొన్ని కొన్ని విషయాల్లో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాల్సిన స్థానే అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం సరికాదన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. కుష్బు వ్యాఖ్యలపై కోర్టు ఎలా స్పందిస్తుందో..?