ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రమైన ముప్పు ముంగిట ఉన్నారని... ఆయనకు ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటితో పాటు ఆయన తిరుగాడే ప్రాంతాల్లో మావోయిస్టులు ఇప్పటికే పలుమార్లు రెక్కీ నిర్వహించారు. గత శాసనసభ సమావేశాల సమయంలో, మొన్న హైదరాబాద్ లో చంద్రబాబు కొత్తఇంటి ప్రవేశం చేసినప్పుడు కూడా మావోయిస్టులు రెక్కీ చేశారు. దీంతో పోలీసులు మరోసారి ఆయన భద్రతను పెంచుతున్నారు.
కాగా సీఎంతోపాటు చాలామంది పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా ముప్పు ఉందని ఏపీ డీజీపీ సాంబశివరావు నిన్న ప్రకటించారు. గత అక్టోబర్ లో ఏవోబీలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయాక.. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మావోలకు లక్ష్యంగా మారారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాగా ఇప్పటికే సీఎం భద్రతను భారీగా పెంచారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరింత భద్రత పెంచనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు... విజయవాడలో సీఎం నివాసం నుంచి అమరావతికి వెళ్లే దారిని కూడా మార్చడానికి ఇదే కారణమని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/