విజ‌య‌వాడ‌లో ఆ హాట్ సీటు కోసం ట్ర‌యాంగిల్ ఫైట్‌... బాబుకు టెన్ష‌నే...!

Update: 2022-09-13 04:14 GMT
మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఎక్క‌డికక్క‌డ నాయ‌కులు సీట్లు రెడీ చేసుకుంటున్నారు.. అధికార పార్టీ వైసీపీలో అయితే.. ఈ విష‌యంలో ఒకింత క్లారిటీ క‌నిపిస్తోంది. దాదాపు ఓ 50 సీట్లు మిన‌హా.. మిగిలిన వారు ఖ‌రారైన‌ట్టేన‌నే జోష్‌లో ఉన్నారు. అయితే.. ఎటొచ్చీ.. టీడీపీలోనే సందిగ్ధావ‌స్థ కొన‌సాగుతోంది. ఎవ‌రికి టికెట్ ఇస్తారో.. ఎవ‌రికి ఇవ్వ‌రో.. ఇప్ప‌టికీ ఒక క్లారిటీ లేదు. అంతేకాదు.. అస‌లు పొత్తులు ఉంటే.. ప‌రిస్తితి ఏంట‌నేది కూడా పార్టీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీంతో నాయ‌కులు సీట్ల వేట‌లో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న ప‌రిస్థితి టీడీపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో తృటిలో సీటును త‌ప్పించుకున్న నాయ‌కులు ఇప్పుడు పోటీకి రెడీ అవుతున్నారు. "మేం ఫైర్ బ్రాండ్లం. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టిగా మాట్లాడుతున్నాం. మాకే టికెట్ ఇవ్వాలి!" అని ఓ మాజీ ఎమ్మెల్సీ ప‌ట్టుబ‌డుతున్నారు.

అంతేకాదు..ఈయ‌న పార్టీ అదినేత చంద్ర‌బాబుకు సైతం లేఖ సంధించిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ  న‌డుస్తోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు దూకుడుగా ఉన్న ఈనాయ‌కుడు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీసీ నాయ‌కుడు. అయితే.. టికెట్ విష‌యంపై చంద్ర‌బాబు ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఫుల్లుగా సైలెంట్ అయిపోయారు.

ఇక‌,ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ మ‌రోసారి కుమార్తె అస్త్రం సంధిస్తున్నారు. ఈ ద‌ఫా మ‌ళ్లీ త‌న కుమార్తెకు టికెట్ ఇవ్వాల‌ని.. ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ సారి ఆయ‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని కొన్నాళ్లు ప్ర‌తిపాద‌న వచ్చినా.. అనారోగ్య కార‌ణంగా ఆయ‌న మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గి.. మ‌రోసారి త‌న కుమార్తెకు ఇవ్వాల‌ని.. ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబుకు విన్న‌వించుకున్నార‌ట‌. అయితే..దీనిపైనా చంద్ర‌బాబు మౌనంగా ఉన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో జ‌లీల్ కుమార్తెకే టికెట్ ఇచ్చారు.అయితే.. ఆమె ఓడిపోయిన వెంట‌నే అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు. దీంతో సానుభూతి ప‌వనాలు మిగ‌ల్లేదు. ఆమె కనుక‌.. ఇక్క‌డే ఉండి.. పార్టీకోసం ప‌నిచేసి ఉంటే.. ఖ‌చ్చితంగా సానుభూతి పెరిగి ఉండేద‌నే అంచ‌నాలు ఉన్నాయి. మ‌రోవైపు.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని త‌న కుమార్తె శ్వేత‌కు సైతం ఇక్క‌డ టికెట్ ఇప్పించుకునేలా చ‌క్రం తిప్పుతున్నారు. ప్ర‌స్తుతం కార్పొరేట‌ర్‌గా ఉన్న ఆమెను గెలిపించుకునే బాధ్య‌త త‌న‌దేన‌ని నాని చెబుతున్నారు.

ఇలా.. పశ్చిమ విష‌యంలో ముగ్గురు నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఇదిలావుంటే.. రేపు జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే.. ఇక్క‌డి సీటును జ‌న‌సేన‌కు కేటాయించే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు జ‌న‌సేన వ‌ర్గం నాయ‌కులు. పోతిన మ‌హేష్ ఇక్క‌డ జ‌న‌సేన నేత‌గా ఎదుగుతున్న క్ర‌మంలో ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. బెట‌ర్ అనే బావ‌న ఉంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఎటూ టికెట్ తేల్చ‌డం లేద‌ని.. త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News