కరోనా ఆ జాతినే అంతం చేస్తోందా?

Update: 2020-08-05 00:30 GMT
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆవహించింది. పట్టి పీడిస్తోంది. మానవాళిని కబళిస్తోంది. దీన్ని అంతం చేయడానికి శాస్త్రవేత్తలు ఆపసోపాలు పడుతున్నారు. వ్యాక్సిన్ వస్తేనే కంట్రోల్ చేయగలం.. ప్రస్తుతం రోగ నిరోధక శక్తితోనే కంట్రోల్ చేస్తున్నాం.

అయితే అత్యాధునిక వైద్యసదుపాయాలు గల పట్టణాలు, గ్రామాల్లోనే మనుషులు చావు తప్పించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటే.. ఇక ఆదివాసీ జాతులు, తెగల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న ప్రశ్న.

కరోనా వైరస్ ఆదివాసీ తెగలు, జాతులతోపాటు దేశాలనే తుడిచిపెట్టేయగలదని ఐక్యరాజ్యసమితి ఆదివాసీ హక్కుల కమిటీ సభ్యుడు విక్టోరియా టాలీ కార్పజ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.2009లో కెనడాలో హెచ్1ఎన్1 వైరస్ ప్రబలి ఆదివాసీ కెనడియన్లు 16శాతం తుడిచిపెట్టుకుపోయారని తెలిపారు.

ఆదివాసీ తెగలలో ముఖ్యంగా పోషకాహార లోపంతోపాటు ఇంతకుముందే వేరే రకాల వ్యాధులు సోకి ఉండడంతో వ్యాధి సంక్రమణ రేటు ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి తెలిపారు. ముఖ్యంగా ఆమెజాన్ అటవీ ప్రాంతం సహా ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా ప్రబలితే ఆ జాతులే అంతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Tags:    

Similar News