ట్రిఫుల్ త‌లాక్ లో మోడీ స‌ర్కారును ఆదుకునేదెవ‌రు?

Update: 2019-07-30 08:38 GMT
ఏది ఏమైనా తాను అనుకున్న‌ట్లుగా ట్రిపుల్ త‌లాక్ బిల్లును ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా పాస్ చేయించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది మోడీ స‌ర్కారు. ఇప్ప‌టికే లోక్ స‌భ‌లో ఈ బిల్లును పాస్ చేసి.. రాజ్య‌స‌భ‌కు పంపారు. ఈ మ‌ధ్యాహ్నం ఈ బిల్లు రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. అయితే.. లోక్ స‌భ‌లో బిల్లు పాస్ అయినంత ఈజీగా రాజ్య‌స‌భ‌లో పాస్ అయ్యే ఛాన్స్ లేదు.

ఎందుకంటే.. రాజ్య‌స‌భ‌లో బీజేపీ.. ఎన్డీయే కూట‌మికి బ‌లం లేక‌పోవ‌ట‌మే. రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తుతం 241 మంది స‌భ్యులే ఉన్నారు. దీంతో బిల్లు గ‌ట్టెక్కాలంటే త‌ప్పనిస‌రిగా 121 మంది స‌భ్యులు అవ‌స‌రం. అయితే.. బీజేపీ స‌హా ఎన్డీయే ప‌క్షాల‌కు ఉన్న స‌భ్యుల సంఖ్య 113 మంది మాత్ర‌మే. అంటే.. బిల్లు పాస్ కు అవ‌స‌ర‌మైన మెజార్టీకి ఎనిమిది మంది స‌భ్యుల దూరంలో ఆగింది.

దీంతో.. ట్రిఫుల్ తలాక్ బిల్లు ఆమోద ముద్ర ప‌డేలా ఏ పార్టీ మోడీకి సాయంగా నిలుస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అటూ యూపీఏకు కానీ.. ఇటు ఎన్డీయూకి కానీ మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా త‌ట‌స్థంగా ఉన్న పార్టీలే కీల‌కంగా మారాయి. అలాంటి పార్టీల్లో బీజేపీకి ఏడుగురు.. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇద్ద‌రు.. టీఆర్ ఎస్ కు ఆరుగురు.. ఎన్ పీఎఫ్ కు ఒక‌రు.. ఇత‌రులు ఇద్ద‌రు ఉన్నారు.

మొత్తంగా 18 మంది ఉన్న ఈ స‌భ్యుల్లో మోడీ స‌ర్కారుకు అండ‌గా నిలిచే ఆ ఎనిమిది మంది ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. టీఆర్ ఎస్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పార్టీలు కానీ ఓకే అంటే.. ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఇట్టే పాస్ అవుతుంది. అయితే.. ఈ రెండు పార్టీల‌తో ప్ర‌స్తుతం మోడీ సున్నం పెట్టుకోవ‌టం తెలిసిందే. మొత్తంగా.. ఈ బిల్లు పాస్ కావాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్న మోడీ స‌ర్కారుకు అండ‌గా ఎవ‌రు నిలుస్తార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News