దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ పై సుప్రీం కోర్టు తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పు వెనుక భర్త నిరాదరణతో వీధిన పడి.. పట్టుదలతో తనకు జరిగిన అన్యాయంపై పోరాడిన ధీర వనితగా నిలిచారు తబుస్సమ్ బానో. 29 ఏళ్ల బానో ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్నది ప్రశ్నలుగా మారాయి. మొక్కవోని దీక్షతో తనకు ఎదురైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఆమె చేసిన పోరాటానికి ఫలితంగా దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లిం మహిళలకు ఇప్పుడు తలాక్ నుంచి సుప్రీం రక్ష లభించింది.
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన బానోకు 2006లో ఆమె భర్త తలాక్ చెప్పిన తర్వాత ఆమె కొడుకును తీసుకొని నర్సింగ్ గఢ్ నుంచి అలహాబాద్ చేరుకున్నారు. ఆమె సోదరి షీబా సారథ్యంలో నడిచే ఎన్జీవో ఆమెను అక్కున చేర్చుకుంది.
ఏడాది తర్వాత ఈ రిక్షాను అద్దెకు తీసుకొని నడిపేది. ఆలహాబాద్ లో ఆటో రిక్షా నడిపే మొదటి మహిళా డ్రైవర్ బానోనే కావటం గమనార్హం. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న బానోకు చిన్న వయసులోనే ప్రతాప్ గఢ్ కు చెందిన మహ్మద్ నసీంతో 2001లో పెళ్లి అయ్యింది. కట్నం ఇవ్వలేదన్న సాకుతో ఆమెకు తలాక్ చెప్పేశాడు భర్త. దీంతో.. ఐదేళ్ల కాపురం తలాక్ పుణ్యమా అని విచ్చిన్నం అయిపోయింది.
ఆటో నడుపుకుంటూ తన కాళ్ల మీద తాను బతుకుతూ.. కొడుకును పోషిస్తున్న ఆమె.. తలాక్ మీద తన న్యాయపోరాటాన్ని మాత్రం ఆపలేదు. ప్రస్తుతం అలహాబాద్ రోడ్ల మీద ఆటో రిక్షాను నడుపుతున్న బానో ఇప్పుడు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. తలాక్ మీద కోర్టు తీర్పు నేపథ్యంలో బానో భర్త స్పందనను తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు విపరీతంగా ప్రయత్నిస్తున్నా.. అతను మాత్రం స్పందించటం లేదు. మీడియా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు.