బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుందా? ప‌్రత్యర్థులను ఎండగట్టేందుకు చేసిన ఎత్తుగడ ఆ పార్టీకి చెందిన సీఎం కుర్చీకే ఎర్త్ పెట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విడుదల చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) ముసాయిదా జాబితాపై రాజకీయ రభస ఈ పరిణామానికి కారణమైంది. దేశమంతా అసోం ఎన్ ఆర్ సీ పై చర్చ నడుస్తున్న తరుణంలో త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కుమార్ పుట్టిన ప్రాంతంపై వివాదం చెలరేగింది. విప్లవ్ దేవ్ విషయంలో వికీపీడియా పేజీలో నిరంతర మార్పులు కనిపించడంతో...బీజేపీ దూకుడు సెల్ఫ్ గోల్ అయింది.
అసోంలో ఎన్ ఆర్ సీ కారణంగా సొంత దేశంలోనే 40 లక్షల మంది శరణార్థులు కాగా.. తాజాగా త్రిపుర సీఎం విప్లవ్ పౌరసత్వంపై ఈ వివాదం చెలరేగింది. అయితే, దీన్ని నిజం చేస్తూ ఆయన వికీపీడియాలో సమాచారం చేరింది. విప్లవ్ దేవ్ కు సంబంధించిన వివరాల్లో బంగ్లాదేశ్ లో జన్మించి అక్రమంగా భారత్ కు వలసవచ్చారని విప్లవ్ వికీపీడియా పేజీలో సమాచారం చేరింది. అయితే గత గురువారం నుంచి శనివారం మధ్య మొత్తం 37 సార్లు మార్పులు జరిగాయి. ఆయన బంగ్లాదేశ్ లోని చాంద్ పూర్ లో జన్మించి భారత్‌కు అక్రమంగా వలసవచ్చారని ఒకసారి.. త్రిపురలోని గోమతి జిల్లాలో జన్మించారని మరో సారి ఇలా వికీపీడియా పేజీలో నిరంతర మార్పులు కనిపించాయి. ఆయన చాంద్ పూర్ లోని రాజ్ ధర్ గ్రామంలో జన్మించారని గురువారం ఉదయం 10.38 గంటలకు విప్లవ్ వికీపీడియా పేజీలో మొదటిసారి మార్పు కనిపించగా.. గోమతిలోని రాజ్ ధర్ గ్రామంలో జన్మిచారని అదేరోజు మధ్యాహ్నం 1.11 గంటలకు మరోసారి మార్పు జరిగింది. అనంతరం మళ్లీ ఆయన పుట్టింది బంగ్లాదేశ్ లో అని, అక్కడ నుంచి భారత్ కు అక్రమంగా వలసవచ్చారని వికీపీడియా పేజీలో మార్పులు కనిపించాయి. అయితే తాను గోమతి జిల్లాలోనే పుట్టినట్టు విప్లవ్ దేవ్ కుమార్ ఆదివారం వివరణ ఇచ్చారు.
మరోవైపు విప్లవ్ దేవ్ విషయంలో ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ ఘాటుగా స్పందించారు. అసోంలో 40 లక్షల మందిని చొరబాటుదారులుగా గుర్తించినట్టు ఎన్నార్సీ ముసాయిదా జాబితాలో పేర్కొనడాన్ని, వారిని అక్కడినుంచి తరిమేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొనడాన్ని ఓవైసీ కూడా తప్పుపట్టిన సంగతి తెలిసిందే.. బంగ్లాదేశ్ లో జన్మించిన త్రిపుర ముఖ్యమంత్రి కూడా చొరబాటుదారడని ప్రకటించే సాహసం కేంద్రం చేయగలదా? అని ప్రశ్నించారు.