దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కూడా పెట్టేశాయి. కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలను కోరుతున్నాయి. సామాజిక దూరం పాటించడం.. సమావేశాలతో పాటు పలు కార్యక్రమాలు జరుపుకునే విషయంలో ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. పరిమిత సంఖ్యలోనే ప్రజలు వేడుకలు జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నాయి.
అయితే ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా.. కొందరు మాత్రం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కరోనా కేసులు పెరగడానికి పరోక్షంగా కారణం అవుతున్నారు.కరోనాతో ప్రజలు చనిపోతుంటే.. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా త్రిపురలోని రెండు కుటుంబాలు పెళ్లి వేడుకకు రెడీ అయ్యాయి. భారీ జనసందోహంతో వివాహాలు జరుపుకున్నారు.
కోవిడ్ నిబంధనలు మరిచి పెళ్లి చేసుకుంటున్న ఆ జంటలపై వెస్ట్ త్రిపుర కలెక్టర్ సీరియస్ అయ్యారు. స్వయంగా అతిథిలా అక్కడికి వెళ్లి అడ్డుకొని వారిపై కేసులను నమోదు చేయించారు. మండపంలోనే ఆ జంటలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి.
ఉత్తర గేట్ ప్రాంతంలోని ప్యాలెస్ కాంపౌండ్ లో గులాబ్ బాగన్, మాణిక్య కోర్టు అనే రెండు వివాహ మండపాల్లో కరోనా నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ శైలేష్ కుమార్ మొదట ఒక్కడే ఆ పెళ్లికి అతిథిలా వెళ్లాడు. అక్కడ నిబంధనలు గాలికి వదిలేసినట్లు స్వయంగా చూడడంతో పోలీసులను రప్పించి వధూవరులను, కుటుంబ సభ్యులతో సహా అనేకమందిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులపై ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కళ్యాణ మండపాలపై నిషేధం విధించారు. ఆ కలెక్టర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Full View