సుదీర్ఘ రాజకీయ అనుభవం.. చేతిలో ఎంపీ పదవి ఉన్నప్పటికీ.. ఆయన కోరుకున్న కల మాత్రం నేటికీ తీరకపోవటం చూస్తే.. కోరుకున్నది దక్కాలంటే కాలం కూడా కలిసి రావాలేమో అనిపించక మానదు. ఎంపీ రాయపాటి సాంబశివరావును చూసినప్పుడు అనిపించక మానదు. ఎంపీగా ఎన్నికల్లో విజయం సాధించినా.. ఆయన మనసంతా టీటీడీ ఛైర్మన్ పదవి మీదనే ఉంటుంది. ఆ విషయాన్ని ఆయన దాచుకున్నది లేదు. నాడు సోనియా మొదలు నేడు చంద్రబాబు వరకూ టీటీడీ ఛైర్మన్ గిరి కోసం ఆయన అడుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు మాత్రం ఆ పదవి చేతికి రాని పరిస్థితి. ఇదే పదవిని కోరుకున్న మరో ఎంపీ కమ్ సీనీ నటుడు మురళీమోహన్ కు కూడా ఈ పదవి ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు చంద్రబాబు.
ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులకు తానను టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వాలనుకోవటం లేదని బాబు క్లియర్ కట్ గా తేల్చేసిన వేళ.. మరీ పదవి ఎవరికి సొంతం కానుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా ఇద్దరు అధికారుల పేర్లు టీటీడీ ఛైర్మన్ పదవి కోసం వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
టీటీడీ ఛైర్మన్ లాంటి పవర్ ఫుల్ పదవి కోసం రాజకీయంగానే కాదు.. పారిశ్రామిక వర్గాలు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. ఈ పదవి మాత్రం ఇద్దరికి మాత్రమే దక్కే అవకాశం ఉందంటున్నారు. వారిలో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ కాగా రెండోవారు టెలికాం రంగ నిపుణులు త్రిపురునేని హనుమాన్ చౌదరి. మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణకు బాబుకు మధ్య చక్కటి అనుబంధం ఉందని.. వీరిద్దరూ ఎస్వీ వర్సిటీలో కలిసి చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉంది. ప్రస్తుతం లక్ష్మీనారాయణ ఏపీ స్టేట్ స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీటీడీ ఛైర్మన్ పదవి త్రిపురనేని హనుమాన్ చౌదరిగా చెబుతున్నారు. దేశ టెలికాం రంగానికి ఆయన చేసిన సేవలకు ఈ ఏడాది భారత సర్కారు పద్మశ్రీతో సత్కరించింది కూడా. దైవభక్తి ఎక్కువగా ఉంటే త్రిపురనేనికే టీటీడీ ఛైర్మన్ పదవి ఛాన్స్ లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ మాటలకు తగ్గట్లే బాబు నిర్ణయం ఉంటుందా? అన్నది కాలమే నిర్ణయించాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/