బండి సంజయ్ పాదయాత్రకు కష్టాలు!

Update: 2021-09-29 04:30 GMT
పాదయాత్ర చేసి అందరూ ముఖ్యమంత్రులు అవుతామని ఆశిస్తున్నారు. తెలుగునాట వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, జగన్ పాదయాత్ర చేసి సీఎం పీఠంపై కూర్చుకున్నారు. పాదయాత్ర చేస్తే చాలు ముఖ్యమంత్రులై పోవచ్చు అనే భావనతో చాలా ఉన్నారు. ప్రస్తుతం పాదయాత్ర ట్రెండ్‌గా కూడా నడుస్తోంది. నేడో రేపు వైఎస్ఆర్‌టీపీ నేత షర్మిల కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.  అయితే ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న బీజేపీ నేత బండి సంజయ్ ఎన్నికల కోడ్ కష్టాలు వచ్చాయి. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల నేపథ్యంలో పలు ఆంక్షలను ఎన్నికల సంఘం విధించింది. బండి సంజయ్‌ పాదయాత్రకు హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధం ఏమిటనే అనుమానం రావచ్చు.

అయితే బుధవారం బండి సంజయ్ పాదయాత్ర సిద్దిపేట జిల్లాలో ముగుస్తుంది. గురవారం నుంచి కరీంనగర్ జిల్లాలోకి ఆయన పాదయాత్ర ప్రవేశిస్తుంది. అక్టోబర్ 2వ తేది హుజురాబాద్‌‌లోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.  హుజురాబాద్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అదే రోజు హుజురాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ కష్టాలు ఆ పార్టీ వచ్చాయి. ఎన్నికలు నిర్వహిస్తున్న నియోజకవర్గంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదంటూ ఈసీ నిబంధన విధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం కఠిన ఆంక్షలు విధించింది. 500లకు మించి జనసమీకరణ ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది.


ఎన్నికల సంఘం నిబంధనతో బీజేపీ నేతలు చిక్కుల్లోపడ్డారు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లా వాసి కనుక వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాదయాత్రకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంజయ్ వెంటరోజూ పాదయాత్రకు వందలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం హుజురాబాద్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రూట్ మ్యాప్‌లో బీజేపీ నేతలు మార్పలు చేర్పులు చేస్తున్నారు.  హుజురాబాద్ తగలకుండా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. బండి సంజయ్ పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడింది. మూడుసారి అనుకున్నట్లే పాదయాత్ర ప్రారంభించారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై పాదయాత్ర ప్రభావం ఉంటుందని ఆ పార్టీ భావించింది. అయితే పాదయాత్ర హుజురాబాద్‌ను తాకకుండా పోవడం ఆ పార్టీకి నిరాశను కల్గించిందని అంటున్నారు.

హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా పాదయాత్రలోనే తన ఎన్నికల ప్రచారాన్నిమొదటు పెట్టారు. అనుకోని అవాంతాలు రావడంతో ఆయన పాదయాత్ర బ్రేక్ పడింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తిరిగి పాదయాత్ర చేస్తే  ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. ఎన్నికల నిబంధనల వల్ల ఆయన పాదయాత్రకు కూడా బ్రేక్ పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇటు బండి సంజయ్ పాదయాత్ర అటు ఈ పాదయాత్రకు ఎన్నికల సంఘం నిబంధనలతో బ్రేక్ పడినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:    

Similar News