ఈట‌ల రాజేంద‌ర్‌కు ఛాన్సిచ్చిన టీఆర్ఎస్ !

Update: 2021-05-26 02:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆప్తుల్లో ఒక‌ర‌నే పేరున్న టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత తెలంగాణ వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లతో ప‌ద‌వీచ్యుతుడు అయిన సంగ‌తి తెలిసిందే. ఈట‌ల‌పై ఆరోప‌ణ‌లు రావ‌డం ఆల‌స్యం  సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించ‌డం, ఒక్క రోజులోనే నివేదిక రావ‌డం , ఆయ‌న్ను ప‌దవి నుంచి ఊడ‌బీక‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. అయితే, అదే రీతిలో తాజాగా అలాంటి ఓ ఉదంతంలో ఈట‌ల కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ చాన్స్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై ఈట‌ల ప‌ద‌వి ఊడ‌టం, అనంత‌రం టీఆర్ఎస్ వ‌ర్గాలు ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, తాజాగా అదే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఓ భూవివాదంలో చిక్కుకున్నారు. హైద‌రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా లోని  సర్వే నంబర్ 152 లో 90 ఎకరాల భూమి విషయం వివాదంలో ఉంది. ఈ వివాదంలో తలదూర్చినట్లు ఎమ్మెల్యే పై ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమ వద్ద డబ్బులు డిమాండ్ చేశాడని కోర్టు కు వెళ్లి కోర్టు కు వెళ్లిన మేకల శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. త‌మ‌పై దౌర్జన్యానికి పాల్పడ్డార‌ని మాట వినకపోతే చంపుతామని కూడా బెదిరించారనే ఫిర్యాదుతో ఉప్పల్ ఎమ్మెల్యే పై కేసు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో ఫిర్యాదు వ‌చ్చిన వెంట‌నే విచార‌ణ జ‌రిపించ‌డ‌మే కాకుండా చ‌ర్య‌లు కూడా తీసుకున్న ప‌రిస్థితి. అదే ఉప్ప‌ల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి విష‌యంలో కోర్టు ఆదేశాలు కూడా వెలువ‌డ్డాయ‌ని... ఆయ‌న విష‌యంలో ఎందుకు స్పంద‌న లేద‌ని మాజీ మంత్రి ఈట‌ల మ‌ద్ద‌తుదారులు, ప‌లు బీసీ సంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి. అసైన్డ్ ల్యాండ్ విష‌యంలో అంత వేగంగా చ‌ర్య‌లు తీసుకున్న‌పుడు ప్ర‌భుత్వ భూమి విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు  చర్య‌లు చేప‌ట్ట లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, కాప్రా భూ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారని తనకు ఎమ్మార్వో చెబితే ఆ విషయంపై పోలీసు అధికారితో మాట్లాడాతానని ఆయన వెల్లడించారు. తాను ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అడ్డుకున్న కానీ..తనకు ఎటువంటి దుర్బుద్ధి లేదన్నారు.
Tags:    

Similar News