కాసుల కక్కుర్తి తప్పించి..మరింకేమీ పట్టని ప్రైవేటు ఆసుపత్రుల ఆరాచకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా వేళ.. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి సంబంధించి ఇప్పటికే పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కథనాలు పెద్ద ఎత్తున ప్రసారమయ్యాయి. అయినప్పటికీ పెద్దగా స్పందించని తెలంగాణ సర్కారు తాజాగా మాత్రం అనూహ్యంగా స్పందించింది.
కాసుల కోసం కరోనా టెస్టులో నెగిటివ్ గా తేలిన వ్యక్తికి పాజిటివ్ అని చెప్పి వైద్యం చేసి.. వార్తల్లోకి ఎక్కిన డెక్కన్ ఆసుపత్రిపై కొరడాను విదిల్చింది. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఈ ఆసుపత్రిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.
కరోనా నేపథ్యంలో కాసుల కక్కుర్తితో ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. బీమా సౌకర్యం ఉన్నా అందుకు నో చెప్పి.. ఓన్లీ క్యాష్ తో మాత్రమే చికిత్స చేస్తున్న వైనాలు ఇప్పటికే పలుమార్లు మీడియాలో రిపోర్టు అయ్యాయి. నిన్నటికి నిన్న కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చిన వ్యక్తికి పాజిటివ్ అని చెప్పి చికిత్స చేయటం.. పాజిటివ్ రోగుల మధ్య ఉంచి చికిత్స చేసిన వైనం వెలుగు చూసింది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కాలంలో ప్రైవేటు ఆసుపత్రుల మీద వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తొలిసారి కొరడా ఝుళిపించిన కేసీఆర్ సర్కారు డెక్కన్ ఆసుపత్రి అనుమతి రద్దు చేశారు. కరోనా వేళ.. తెలంగాణలో వేటు పడిన తొలి ప్రైవేటు ఆసుపత్రిగా నిలిచింది. తాజాగా ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కొత్త కరోనా కేసుల్ని ఆడ్మిట్ చేసుకోవటానికి వీల్లేదు. అంతేకాదు.. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు ప్రైవేటు ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఆదేశించిన ధరలకు మాత్రమే చికిత్స చేయాలని.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని చెప్పింది. తాజాగా తీసుకున్న షాకింగ్ నిర్ణయంతో ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులు ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.