ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట ప్రస్తుతం జిల్లా కేంద్రం. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి కంచుకోటగానే ఉంటోంది. ముందుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హవా సాగిన తరువాత హరీశ్ రావు ఈ నియోజకవర్గంపై పట్టు సాధించారు. మొత్తానికి ఇక్కడ టీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలకు గెలిచే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఏ ఎన్నిక జరిగినా పార్టీ అధినేత కేసీఆర్.. తన మేనల్లుడు అయిన హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కొందరి నాయకుల తీరు వల్ల పార్టీ పరువు పోతుందన్న చర్చ సాగుతోంది.
సిద్ధిపేట కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ అభ్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపక్షంగా రాష్ట్రవ్యాప్తంగా బలపడుతున్న బీజేపీ నాయకులు ఇక్కడ కూడా పట్టు సాధించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థులు మద్యం, డబ్బు పంచడాన్ని అడ్డుకుంటున్నారు. కొందరు యధేచ్ఛగా ఓటర్లకు పంచుతుండగా బీజేపీ నాయకులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
సిద్ధిపేటలోని వార్డు నెంబర్ 24లో టీఆర్ఎస్ అభ్యర్థి బాతుల మహేశ్ ఓటర్లకు మద్యం పంచుతుండగా బీజేపీ నాయకులు పట్టుకున్నారు. అలాగే 34వ వార్డు అభ్యర్థి, 42వ వార్డు అభ్యర్థి రాధిక లు మద్యం బాటిళ్లతో దొరికిపోయారు. కొందరు మద్యం, డబ్బులు పంచుతున్నారని బీజేపీ నాయకులకు తెలియగానే పోలీసుల కంటే ముందే వారు వెళ్లి పట్టుకొని వీడియోలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టి టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు.
ఇవే కాకుండా చాలా చోట్ల అధికార పార్టీ నాయకులు డబ్బుతో కనిపించిన ఫొటోలు, వీడియోలను బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ డబ్బు ఖర్చుపెట్టి గెలవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ తరుపున బరిలో ఉన్న చాలా మందికి ఎన్నికలపై అవగాహన లేదు. అందువల్ల వారు చేసే కొన్ని పనుల బహిర్గతమై పార్టీ పరువు తీస్తున్నారని అనుకుంటున్నారు.