గన్ మ్యాన్ ‘గన్’ కారు డ్రైవర్ చేతికి ఎలా వచ్చింది?

Update: 2016-02-17 05:43 GMT
మంగళవారం మధ్యాహ్నం టీవీల్లో ఫ్లాష్ అయిన బ్రేకింగ్ న్యూస్ తో కలకం రేగింది. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గన్ మ్యాన్ కు చెందిన తుపాకీని ఎమ్మెల్యే డ్రైవర్ చేతిలో పేలటం.. దానికి అతగాడి ప్రాణాలు కోల్పోవటం జరిగిపోయాయి. ఈ ఉదంతం ఎలా జరిగిందన్న విషయంలోకి వెళితే.. కేవలం మూడు నిమిషాల నిర్లక్ష్యం ఈ దారుణానికి కారణంగా చెప్పొచ్చు.

మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే.. అధికార పార్టీకి చెందిన నేత మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్.. ఆయనకు చెందిన గన్ మ్యాన్ ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు కేటాయించిన ఫ్లాటులో ఎమ్మెల్యే ఉన్న సమయంలో.. ఆ కిందనే ఎమ్మెల్యే డ్రైవర్.. మరో డ్రైవర్ వెంకట్.. ఇద్దరు గన్ మ్యాన్లు ఉన్నారు.  సందర్భంగా గన్ మ్యాన్ రవీందర్ తన బుల్లెట్ పౌచ్ ని కట్టించుకునేందుకు బయటకు వెళుతూ.. తన సర్వీస్ రివాల్వర్ ను మరో డ్రైవర్ వెంకట్ కు ఇచ్చేశారు. అలా బయటకు వెళ్లిన గన్ మ్యాన్ కేవలం మూడు నిమిషాల వ్యవధిలో తిరిగి వచ్చారని చెబుతున్నారు.

అప్పటికే తన చేతికి వచ్చిన గన్ ను.. ఎలా వాడాలో తెలీక.. స్లైడర్ ను లాగేశారని.. గన్ చూడాలన్న ఆతృతలో మరో డ్రైవర్ అక్బర్ లాక్కుని చూస్తూ..తెలీక ట్రిగ్గర్ ను నొక్కేయటం.. బుల్లెట్లు దూసుకెళ్లటం.. నేరుగా ఛాతీకి తగలటంతోనే ఘటనాస్థలంలోనే ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు. మరోవైపు.. అక్బర్ ను చంపారంటూ అతని పిన్ని ఆరోపిస్తోంది.

ఈ ఉదంతంలో ఆసక్తికరంగా అనిపించే కొన్ని అంశాలు చూస్తే..

= సర్వీసు రివాల్వర్ ను అక్కడే ఉన్న గన్ మ్యాన్ కి ఇవ్వకుండా డ్రైవర్ కి ఇవ్వటం ఏమిటి?

= రివాల్వర్ లాంటివి అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే తన కోలీగ్ అయిన వ్యక్తికి ఇవ్వాలి కానీ.. సంబంధం లేనోళ్లకు ఇవ్వటం ఏమిటి?

= ఒకవేళ తుపాకీని ఇవ్వాల్సి వస్తే.. బుల్లెట్లను తీసి ఇస్తే ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. అలాంటి ఆలోచన గన్ మ్యాన్ కి ఎందుకు రాలేదు?

= సర్వీస్ రివాల్వర్ మిస్ ఫైర్ కావటం ఎన్నిసార్లు వినలేదు? అలాంటి ప్రమాదం పొంచి ఉంటుందని సదరు గన్ మ్యాన్ ఎందుకు గుర్తుకు రాలేదు?
Tags:    

Similar News