అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే

Update: 2019-09-20 07:08 GMT
తెలంగాణ అసెంబ్లీలో కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీత బోరుమని ఏడ్చేశారు. కన్నీళ్లు ఆపుకోలేకపోయారు..  ఓ యువకుడి బాధతోపాటు తన తండ్రికి జరిగిన కిడ్నీ వ్యాధి ఉదంతంపై సునీత నిండు సభలో కన్నీటి పర్యంతం అయ్యారు..

కిడ్నీ బాధితులను తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం ఆదుకోవాలని కోరుతూ టీఆర్ ఎస్ ఆలూరు ఎమ్మెల్యే గొంగడి సునీత వారి దీనగాథను చెప్పుకొచ్చారు. ‘‘ఒక యువకుడు తనకు రాత్రి వాట్సాప్ పెట్టాడని.. కిడ్నీలు పాడై వారంలో రెండు సార్లు హైదరాబాద్ వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నాని..ఖర్చులకు డబ్బులు లేవని.. తండ్రి లేడని.. తల్లి వృద్ధురాలని బోరుమని ఏడ్చాడని’’ సునీత తెలిపారు. కొద్దిరోజులకే ఆ యువకుడు మరణం తనను కలిచివేసిందన్నారు..

ఇక తన తండ్రి కూడా కిడ్నీ ఫెయిల్ తమ కుటుంబం ఎంత ఆర్థికంగా చితికిపోయిందో తెలుసు అంటూ సునీత ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక సభలో ఏడ్చేశారు. కిడ్నీ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని సూచించారు. వారికి ఎయిడ్స్ రోగులకు ఇస్తున్నట్టే పింఛన్ ఇప్పించాలని.. సాయం చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  కిడ్నీ రోగుల కష్టాలు కళ్లారా చూశానని.. తనకూ కన్నీళ్లు ఆగలేదని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని.. కేంద్రానికి లేఖ రాసి వారి బాధలు తీర్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.


Full View

Tags:    

Similar News