ప్ర‌ణ‌య్ హ‌త్య కేసులో ఆ మాజీ!!

Update: 2018-09-16 13:30 GMT
న‌ల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి ప్రణయ్‌ ని హత్య చేసిన విషయం తెలిసిందే. తన కళ్లేదుటే భర్త దారుణ హత్యకు గురికావడంతో షాక్‌కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న అమృత వర్షిణి శనివారం నోరువిప్పింది. ప్రేమ వివాహం తన తండ్రికి మొదటి నుంచీ ఇష్టం లేదని - బెదిరింపులకు పాల్పడుతూనే చివరకు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కన్నీటి పర్యంతమైంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను భర్త ప్రేమకు గుర్తుగా పెంచుకుంటానని తెలిపింది. తన భర్తను హత్య చేయించిన తండ్రి మారుతీరావు - బాబాయి శ్రవణ్‌ ను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని వేడుకుంది.

పుట్టింటికి వెళ్లే ప్రసక్తే లేదని - త‌నకు - త‌న బిడ్డకు పోలీసుల రక్షణ కావాలని అమృత మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వాన్ని వేడుకుంది.ప్రణయ్ హత్యపై అమృత మాట్లాడుతూ... మిర్యాలగూడ సెంటర్‌ లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది... మా నాన్నకు నేను సొంత కూతురునే... అయినా నా పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తాడని అనుకోలేదంటోంది అమృతి. ఇప్పుడు మా నాన్న నా ఎదురుగా వచ్చి క్షమించమ్మ అంటే మా నాన్నను చంపేస్తా నని హెచ్చరిస్తోంది. తాను పరువు హత్యలు - కులరహిత సమాజం కోసం పోరాటం చేస్తానన్న అమృతి... మా నాన్న - బాబాయ్ సైకోలు అంటూ మండిపడింది. నేను ఎన్ని కష్టలు ఎదురైనా నా బిడ్డను పెంచుకుంటానన్న ఆమె... పుట్టింటికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం - కాంగ్రెస్ నేత కరీంతో పాటు మరికొందరితో కలిసి నాన్న... ప్రణయ్‌ని చంపించాడని ఆరోపించింది. కాగా - ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి - బాబాయ్‌ ని అరెస్ట్ చేసిన పోలీసులు... మిర్యాలగూడ కాంగ్రెస్ నేత కరీంను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు అమృత ఆరోప‌ణ‌లు మ‌రోవైపు క‌రీం అరెస్టు సంచ‌ల‌నంగా మారాయి.
Tags:    

Similar News