అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ వికటిస్తోంది. ఎన్నికల అనంతరం పార్టీలో చేరి నాయకులకు - ముందునుంచి ఉన్న నేతలకు మధ్య పొసగని పరిస్థితుల్లో ఏకంగా ముష్టియుద్ధాలకు దిగుతున్నారు. తాజాగా జీహెచ్ ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే విధంగా ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ సాగిన వార్ లో ముష్టియుద్ధాలకు పాల్పడటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బ్యానర్ లో ఫొటోల విషయంలో ఎమ్మెల్యే - కార్పొరేటర్ ఘర్షణ పడి అనుచరులు కుర్చీలు విసురుకున్నారు. తోపులాటలో కార్పొరేటర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇదంతా హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ సమక్షంలోనే జరగడం విశేషం.
టీడీపీ తరఫున గెలిచిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ చేరికను గతంలోనే కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకించారు. తాజాగా సర్కిల్ పరిధిలో రూ.1.53 కోట్లతో చేపట్టనున్న సీసీరోడ్డు - వ్యాయామశాల - ప్లే గ్రౌండ్ వంటి అభివృద్ధి పనులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తో కలిసి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అంతకు ముందే స్టేజీపై ఉన్న కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బ్యానర్ లో నా ఫొటో చిన్నగా ఉంది అని బ్యానర్ ను తొలగించారు. స్థానిక కార్పొరేటరైన తన ఫొటో కాకుండా టీఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు సరికొండ వెంకటేష్ ఫొటో ఎలా పెద్దగా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సమావేశం ప్రారంభం కాగానే ఎమ్మెల్యే స్టేజీపైకి వచ్చి బ్యానర్ కట్టాలని అనుచరులకు సూచించారు. వారు బ్యానర్ కట్టారు. కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి మళ్లీ ఆ బ్యానర్ ను తొలగించేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యేకు ఆయనకు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో ఇరువురు అనుచరులు బాహాబాహీకి దిగారు. కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘటనలో కార్పొరేటర్ కు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఈ ఘటన ద్వారా టీఆర్ ఎస్ లో ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టమైంది. గతంలో కూడా రెండుసార్లు ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఎమ్మెల్యే - కార్పొరేటర్ మధ్య ఉన్న విభేదాల కారణంగా డివిజన్ లో అభివృద్ధి పనులు జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.కాగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందిస్తూ తాను ఈ ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.