సామాన్యులు అసమాన్యులు.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా సమన్యాయ సిద్ధాంతాన్ని నూటికి నూరుశాతం అమలు చేస్తున్న కరోనా ఇప్పటికే పలు షాకులు ఇస్తోంది. తన జోలికి రాకుండా ఉంటే ఓకే కానీ..తాను గీసిన గీతను ఏ మాత్రం దాటినా.. వెంటనే కమ్మేసే లక్షణం ఇటీవల కాలంలో కరోనాకు మరింత పెరిగిందని చెప్పాలి. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మాటకు వస్తే.. ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. మంత్రులకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందేగా? అనుకోవచ్చు.
ఇక్కడో షాకింగ్ అంశం ఉంది. అదేమంటే.. సదరు ఎమ్మెల్యేతో పాటు.. ఆయన ఫ్యామిలీలోని వారందరికి పాజిటివ్ రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగర శివారు నియోజకవర్గమైన పటాన్ చెర్వు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాజాగా కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. శనివారం రాత్రి నుంచి దగ్గు.. జ్వరంతో ఆయన బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో నిన్న ఆయనకు టెస్టు చేశారు.
తనతో పాటు తన భార్య.. సోదరుడు.. డ్రైవర్లు.. గన్ మెన్.. వంట మనిషితో పాటు మొత్తం అందరూ పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వచ్చిన ఫలితం చూస్తే.. మొత్తంగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన తల్లి.. సోదరుడు.. పీఏ.. గన్ మెన్లకు కూడా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం అధికారపక్ష ఎమ్మెల్యే అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్ కొత్తేం కాకున్నా.. ఒక నేత కుటుంబంలో ఇంతమంది పాజిటివ్ గా తేలటం మాత్రం షాకింగ్ గా మారిందని చెప్పాలి.