ఆయన మొన్నటివరకు పార్టీలో తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకొని కాలర్ ఎగురేసుకొని తిరిగారు. కానీ, అన్ని రోజులు ఒకేలా ఉండవు కాదా ...ఈ ఎమ్మెల్యే విషయం లో కూడా అదే జరిగింది. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని , అయన లైఫ్ మొత్తం టర్నింగ్ అయిపోయింది.ఏ ముహూర్తాన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయో కానీ , అప్పటి నుండి సదరు ఎమ్మెల్యే తిండి , తిప్పలు మానేశారు. అసలు అంతలా భయపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అయన అంతగా బయపడటానికి ఏంచేశారు?
తాజాగా తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో అందరూ ముందునుండి ఊహించినట్టుగానే కారు మరోసారి జోరు చూపించి తన సత్తా చాటింది. కానీ ,నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, స్థానిక టీఆర్ ఎస్ నేతలకు, నేటికీ ఒక పీడకలే . పడుకున్నా, లేచినా, అవే ఫలితాలు వారిని తరుముతున్నాయట. ఎందుకు అంటే అక్కడ అధికార పార్టీకి వచ్చిన సీట్లు ఎన్నోతెలుసా ...సున్నా? అవునండి ...అంత ఘోరంగానా అనుకుంటున్నారా , మాములు ఘోరంగా కాదు, ఘోరాతి ఘోరంగా అని చెప్పాలే. భైంసా మున్సిపాలిటీ మొత్తం ఇరవై ఆరు వార్డులున్నాయి. ఇందులో పదిహేను స్థానాలతో మున్సిపల్ పీఠాన్ని ఎంఐఎం ఎగరేసుకుపోయింది. తొమ్మిది సీట్లతో బీజేపీ రెండోస్థానంలో నిలవగా , మరో రెండు వార్డుల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. కానీ , అధికార టిఆర్ ఎస్ కి మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు.
ఈ విషయం సీఎం కేసీఆర్ కు అస్సలు మింగుడుపడటం లేదట. అసలు ఈ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే వున్నారా?లేరా? అని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. ఈ కారణంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునుండి ఆ ఎమ్మెల్యే కంటినిండా కునుకులేకుండా ఉన్నాడట. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ముథోల్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇదే నియోజకవర్గంలోని భైంసా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఆయన గ్రాఫ్‌ను అమాంతం నేలకు పడేశాయి. ఒక్కటంటే ఒక సీటు కూడా గెలవక పోవడం తో కనీసం గల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించని ఎమ్మెల్యే, పార్టీకి ఏవిధంగా ఉపయోగపడతారని పార్టీ పెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు విఠల్ ప్రభావం తగ్గడానికి కుటుంబ సభ్యులు సైతం కారణమన్న మాటలు వినపడ్తున్నాయి. విఠల్ రెడ్డికి షాడో ఎమ్మెల్యేలుగా, కొందరు కుటుంబ సభ్యులు చక్రం తిప్పుతున్నారట. దానివల్లనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందట. వీటి ఎఫెక్టే పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో పడిందన్న చర్చ జరుగుతోంది. దీనితో ఈ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో అక్కడ గెలుపొందింది ఎంఐఎం అని, దీంతో ఫ్రెండ్లీ పార్టీకే పీఠం దక్కింది కాబట్టి, కేసీఆర్ అంత కోపంగా ఏమి లేరని మరికొందరు చెప్తున్నారు. చూడాలి మరి వచ్చే రోజుల్లో చేదు ఫలితాలని చవి చుసిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విదంగా ఉంటుందో ...