ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తే అన‌ర్హ‌త వేటు వేస్తారా?

Update: 2019-06-08 06:00 GMT
పార్టీ ఫిరాయింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ వేటు ప‌డిన టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ యాద‌వ‌రెడ్డి.. ఆ త‌ర్వాత కాలంలో అన‌ర్హ‌త వేటు ప‌డ‌టం తెలిసిందే. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ తాజాగా హైకోర్టులో జ‌రిగింది.

పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డార‌న్న‌కార‌నంగా అన‌ర్హ‌త వేటు వేసిన మాజీ ఎమ్మెల్సీ యాద‌వ‌రెడ్డికి మ‌రో అవ‌కాశం ఇచ్చి ఉండాల్సింద‌ని హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ చౌహాన్ అభిప్రాయ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

2018 న‌వంబ‌రు 23న మేడ్చ‌ల్ లో సోనియా స‌మ‌క్షంలో పార్టీ చేరార‌ని.. అంత‌కు ముందు రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్లుగా తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున న్యాయ‌వాది వాదిస్తుండ‌గా.. అందుకు త‌గ్గ ఆధారాలు చూపించాల‌ని కోరారు. దీనికి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలు.. క్లిప్పింగులు.. వీడియోల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.

ప‌త్రికల్లో వ‌చ్చిన క‌థ‌నాలను చూపించి సాక్ష్యాలుగా ప‌రిగ‌ణించ‌టం స‌రికాద‌ని కోర్టు పేర్కొంది. మ‌రోవైపు తెలంగాణ‌ను ఇచ్చిన కార‌ణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశానే త‌ప్పించి.. తాను పార్టీలో చేర‌లేద‌ని యాద‌వ‌రెడ్డి త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు.  ఈ నేప‌థ్యంలో వాస్త‌వాలు తేల్చేందుకు క్రాస్ ఎగ్జామినేష‌న్ కు అవ‌కాశం ఇచ్చి ఉండాల్సింద‌ని హైకోర్టు పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా వివిధ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క్లిప్పుల‌తో పాటు.. వీడియోల‌ను కోర్టుకు స‌మ‌ర్పించ‌గా.. ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోలేరంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది త‌న వాద‌న‌లు వినిపిస్తూ.. రాజేంద్ర‌సింగ్ రాణా కేసులో ప్ర‌వ‌ర్త‌న ఆధారంగా ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు తెలిపింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా.. యాద‌వ‌రెడ్డి త‌ర‌ఫు న్యాయ‌వాది అడ్డు చెబుతూ.. పార్టీలో చేరార‌న్న ఆరోప‌ణ‌పై పిటిష‌న‌ర్ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ కేసును ఈ నెల ప‌దికి వాయిదా వేస్తూ ధ‌ర్మాస‌నం నిర్ణ‌యం తీసుకుంది.
Tags:    

Similar News