మోడీపై నామినేషన్ల వెనుక టీఆర్ ఎస్

Update: 2019-04-30 04:27 GMT
వారణాసిలో రాజకీయం రంగు మారింది. మోడీపై పోటీచేసేందుకు బయలు దేరిన 50 మంది నిజామాబాద్ రైతుల్లో కేవలం 24మందికి మాత్రమే అధికారులు అనుమతిచ్చారు. 10 మంది స్థానికుల మద్దతు లేదని.. బ్యాంకు ఖాతా స్థానికంగా లేదని తదితర కారణాలు చూపుతూ కొందరి నామినేషన్లు తిరస్కరించారు. ఇక తమిళ రైతు - ఫ్లోరైడ్ రైతులు కూడా మోడీపై నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇందులోనే చిన్న ట్విస్ట్ ఉంది.

మోడీపై నామినేషన్లు వేసిన రైతుల్లో చాలా మంది నిజమైన రైతులు కాదని తేలింది. అందులో చాలా మంది టీఆర్ ఎస్ సభ్యత్వం ఉండి ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు అని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. వీరంతా అధికారికంగా టీఆర్ ఎస్ లీడర్లుగా గ్రామాల్లో చెలామణీ అవుతున్నట్టు గుర్తించారు.

తెలంగాణ నుంచి మొత్తం 50మంది రైతులు.. తమిళనాడు నుంచి ఇంకొంత మంది వారణాసిలో నామినేషన్ వేసేందుకు రాగా.. అందులో చాలామందివి నామినేషన్లు వేయకుండా అధికారులు తిరస్కరించారు. కొందరు వారణాసి పోలీసులు ఈ రైతులపై జులం ప్రదర్శించి ఇబ్బందులకు గురిచేశారట. ఇక స్థానిక బీజేపీ నేతలు కూడా నిజామాబాద్ రైతులు నామినేషన్ వేయకుండా అడ్డంకులు సృష్టించారట..

అయితే మొత్తానికి 24మంది నిజామాబాద్ రైతులు మోడీపై నామినేషన్ వేసేశారు. టీఆర్ ఎస్ నాయకులుగా పిలవబడే పసుపు రైతులే ఇందులో నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. దీని ద్వారా ఓ రకంగా టీఆర్ ఎస్సే మోడీకి ఇబ్బందులు సృష్టిస్తుందన్న అనుమానం కేంద్రంలోని బీజేపీలో వ్యక్తమవుతోందట.. చూడాలి మరి మోడీ దీనికి ఎలాంటి విరుగుడు చూపిస్తాడో..
    

Tags:    

Similar News